Hari Hara Veeramallu OTT: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు పీడకల లాంటి సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రమే. అభిమానులు కూడా రెండవసారి చూసేందుకు ఆసక్తి చూపని చిత్రమిది. నిద్ర పోయేటప్పుడు కూడా ఆ సినిమాలోని అతి నీచమైన గ్రాఫిక్స్ ని చూసి పీడకల అనుకోని నిద్రలో నుండి పైకి లేచే ఒక ఫోబియా లోకి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా లిమిటెడ్ బడ్జెట్ మీద అద్భుతమైన VFX క్వాలిటీ తో సినిమాలను దింపుతున్న రోజులివి. అలాంటి రోజుల్లో ఒక సూపర్ స్టార్ స్టేటస్ లో ఉన్న హీరో సినిమాకు ఇంతటి నాసిరకపు క్వాలిటీ VFX లు పెట్టి సినిమాని తీశారంటే డైరెక్టర్ కి, నిర్మాత కి మూవీ మేకింగ్ పట్ల ఉన్న నిబద్దత ఎలాంటిదో తెలుస్తుంది. ఈటీవీ లో పంచతంత్రం అనే చెక్కల బొమ్మల సీరియల్ ఒకప్పుడు ప్రసారం అయ్యేది గుర్తుందా?.
Also Read: ‘మిరాయ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సినిమాలో ప్లస్సులు,మైనస్సులు ఇవే!
‘హరి హర వీరమల్లు’ లో అనేక సన్నివేశాలు అలాగే ఉంటాయి. 700 రూపాయిలు పెట్టి ప్రీమియర్ షో కి వెళ్లిన ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండుంటుందో మీరే ఊహించుకోండి. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఇచ్చారు ఫ్యాన్స్. అదంతా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం కారణంగా వచ్చిన గ్రాస్ అయినప్పటికీ, ఎక్కడో ఒక మూల ఈ సినిమా వాళ్ళని అలరిస్తుంది అనే ఆశ మాత్రం అలాగే ఉండేది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో అప్లోడ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియా లో ఈ చిత్రం లోని సన్నివేశాలను అప్లోడ్ చేస్తూ వేరే లెవెల్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.
అభికిమానులు అంటే వాళ్లకు తప్పదు, పవన్ కళ్యాణ్ సినిమా ఇంతే కచ్చితంగా చూడాలి అనే మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి ప్రతీ అభిమాని ఈ సినిమాని చూసాడు. కానీ దురాభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసేందుకు ఎగబడ్డారు. ఎందుకంటే ట్రోల్ చెయ్యడం కోసం. అలా అందరూ ఈ చిత్రాన్ని చూడడం వల్ల తెలుగు, హిందీ, తమిళం మరియు మిగిలిన భాషల్లో కూడా ఈ చిత్రం టాప్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది. ఫలితంగా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయట. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. ఒక ఫ్లాప్ సినిమాకు సూపర్ హిట్ చిత్రానికి వచ్చేంత వ్యూస్ రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అది ‘హరి హర వీరమల్లు’ కి జరగడం గమనార్హం.