Deepika Padukone: ఇండియా లోనే టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా దీపిక పదుకొనే(Deepika Padukone) పేరు టాప్ 3 లో ఉంటుంది. బాలీవుడ్ లో ఈమెకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంటుంది. ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన రోజుల్లో షారుఖ్ ఖాన్ కి కనీసం 200 కోట్ల గ్రాస్ సినిమా కూడా ఉండేది కాదు. ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్. అందుకే ఈమెకు రెమ్యూనరేషన్ విషయం లో నిర్మాతలు ఎలాంటి ఆంక్షలు పెట్టరు. ఆమె ఏది కోరితే అది చేస్తారు. అయితే రీసెంట్ గానే ఈమె ప్రభాస్(Rebel Star Prabhas) స్పిరిట్ చిత్రానికి ఎంపికైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెమ్యూనరేషన్ విషయం లో , వర్కింగ్ హావర్స్ విషయం లో డైరెక్టర్ సందీప్ వంగ తో క్లాష్ రావడం తో ఈ సినిమా నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తుంది.
ఈమె గతం లో ప్రభాస్ తో కలిసి కల్కి చిత్రం చేసింది. అతి త్వరలోనే ఆ సినిమా సీక్వెల్ లో కూడా ఈమె కనిపించనుంది. ప్రభాస్ తో నటించడానికి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కేవలం డైరెక్టర్ సందీప్ వంగ యాటిట్యూడ్ వల్లే ఆమె నేడు ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే స్పిరిట్ చిత్రానికి నో చెప్పిన ఈమె, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న అల్లు అర్జున్(Icon Star Allu Arjun). అట్లీ చిత్రం లో నటించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రీసెంట్ గానే డైరెక్టర్ అట్లీ ఆమెని కలిసి స్టోరీ ని వినిపించడం, అందులో ఆమె క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండడం తో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో మొత్తం 5 మంది హీరోయిన్లు ఉంటారట.
దీపిక పదుకొనే, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), జాన్వీ కపూర్(Jhanvi Kapoor) ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు భాగ్యశ్రీ భొర్సే కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక 5వ హీరోయిన్ ని ఎంచుకోవాల్సి ఉంది. ఒక సినిమాలో ఇంతమంది హీరోయిన్స్ ఉండడం ఈమధ్య కాలం లో ఈ సినిమాకే జరిగింది. అయితే ఇందులో ఒక హీరోయిన్ రోల్ పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ అని అంటున్నారు. ముందుగా ఈ పాత్ర కోసం సమంత ని సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు దీపిక పదుకొనే ఈ సినిమా లోకి ఎంటర్ అవ్వడం తో ఆ లేడీ విలన్ రోల్ ఈమెనే చేస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ లో కనిపించనున్నాడు. అందులో ఒక విలన్ పాత్ర అట. ఈ సినిమాకు హీరో ఆయనే, విలన్ కూడా ఆయనే. నేటి తరం స్టార్స్ లో ఎవ్వరూ ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగం చేయలేదు. మరి అల్లు అర్జున్ ఈ ప్రయోగం లో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.