https://oktelugu.com/

Kill OTT: ఓటిటి లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా…

బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీ ప్రస్తుతం డీలాపడి పోయింది. తెలుగు సినిమా హవాను ఎక్కువగా పెరగడం తో బాలీవుడ్ ను పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. అందుకే వాళ్ళ నుంచి సినిమాలు వస్తున్న ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ అయితే ఉండడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : September 30, 2024 / 04:17 PM IST

    Kill Movie OTT

    Follow us on

    Kill OTT: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం వాళ్ల మేనియా ఏమీ నడవడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా లో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా గుర్తింపు సంపాదించుకుంది. దాంతో మన సినిమాలు వరుస సక్సెస్ లను అందుకోవడంతో బాలీవుడ్ హీరోలను పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. ఒకప్పుడు వాళ్ళు ఎలా చెబితే అలా నడిచే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు తలకిందులు అయిపోయింది. తెలుగు సినిమాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క బాలీవుడ్ హీరో సైతం అటెన్షన్ ను మెయింటెన్ చేస్తూ ఆ సినిమా సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ అవుతుందా అనే ఆసక్తితో ఎదురుచూసే రోజులు వచ్చాయి. నిజానికి బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అక్కడి హీరోల సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకే వాళ్ళు మన తెలుగు సినిమాల మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నుంచి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇక అదే సమయంలో ఒక ట్రైన్ లో జరిగిన నిజమైన సంఘటనను గుర్తు చేస్తూ ‘నిఖిల్ నగేష్ బట్’ డైరెక్షన్ లో వచ్చిన ‘కిల్ ‘ సినిమా ప్రేక్షకులందరిని ఆధ్యాంతం అలరించడమే కాకుండా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాని పలు భాషల్లో రీమేక్ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ రీసెంట్ గా ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ తో అవైలబుల్ లో ఉంది.

    మరి ఈ సినిమాని చూడడానికి చాలామంది తెలుగు ప్రేక్షకులు సైతం ఇప్పుడు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఆ సినిమాని చూసి ఓటిటి లో భారీ వ్యూయర్ షిప్ ని దక్కించుకుంది. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ టైమ్ లో భారీ వ్యూస్ అయితే సంపాదించుకోలేదు. కాబట్టి ఈ సినిమా అటు థియేటర్ లో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఓటిటిలో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

    ఇక రీసెంట్ గా రాఘవ లారెన్స్ మెయిన్ లీడ్ లో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని కొంతమంది నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా ఓటిటిలో తెలుగు వర్షన్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు రీమేక్ చేయాలనే నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక మొత్తానికైతే కిల్ సినిమా ప్రస్తుతం ఉన్న ప్రేక్షకుల్లో ఒక మ్యాజిక్ చేసి వాళ్ళను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అందువల్లే వాళ్ళు ఆ సినిమాని ఎక్కువసార్లు చూసి ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే తెచ్చిపెట్టారు…