https://oktelugu.com/

Ananya Panday: సచిన్ టెండూల్కర్ అల్లుడితో ప్రేమాయణం పై మొట్టమొదటిసారి స్పందించిన ‘లైగర్’ బ్యూటీ!

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు, సారా టెండూల్కర్ తో గిల్ చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అంతే కాదు సోషల్ మీడియా లో సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అందరూ గిల్ ని 'అల్లుడు' అని ప్రేమగా పిలుస్తుంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 04:10 PM IST

    Ananya Panday

    Follow us on

    Ananya Panday: ఇండియన్ క్రికెటర్స్ తో స్టార్ హీరోయిన్లు ప్రేమాయణం నడపడం అనేది కొత్త విషయమేమి కాదు. గతం లో ప్రముఖ స్టార్ హీరోయిన్ నగ్మ, మాజీ కెప్టెన్ గంగూలీ తో ప్రేమాయణం నడిపింది. పెళ్లి పీఠాలకు వరకు వచ్చిన వీళ్లిద్దరు ప్రేమ, కొన్ని కారణాల చేత బ్రేకప్ అయ్యింది. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమ వివాహం సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ప్రస్తుతం ఉన్న క్రికెటర్స్ లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆటగాడు శుభ్ మన్ గిల్. ఇతను గేమ్ ఎంత అద్భుతంగా ఆడుతాడో, హీరోయిన్స్ విషయం లో కూడా అదే విధమైన ఆట ఆడుతాడు అని ఒక రూమర్ ఉంది.

    ఇప్పటికే గిల్ పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు, సారా టెండూల్కర్ తో గిల్ చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అంతే కాదు సోషల్ మీడియా లో సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అందరూ గిల్ ని ‘అల్లుడు’ అని ప్రేమగా పిలుస్తుంటారు. బయట సారా టెండూల్కర్ తో కలిసి ఎన్నో ప్రైవేట్ పార్టీలలో పాల్గొనడం వంటివి గిల్ చేసేవాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో తెగ తిరిగేవి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శుభ్ మన్ గిల్ ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే తో ప్రేమాయణం నడుపుతున్నాడని రూమర్స్ ప్రచారం అయ్యాయి. అనన్య పాండే కి కూడా బాలీవుడ్ లో చాలా అఫైర్స్ ఉన్నాయని ఒక టాక్ చక్కర్లు కొడుతూ ఉండేది. గతం లో ఆమె ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం నడిపి, అతనితో డేటింగ్ కూడా చేసింది. కానీ ఏ రిలేషన్ లో అయినా మనస్పర్థలు సర్వ సాధారణమే, అలా వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

    ఆ తర్వాత అనన్య పాండే ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్య తో లవ్ లో పడినట్టు వార్తలు వినిపించాయి. అనంత్ అంబానీ పెళ్లిలో వీళ్లిద్దరు కలిసి డ్యాన్స్ వేయడం, చెట్టాపట్టాలేసుకొని తిరగడం వంటివి చేయడం తో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచారు. వీళ్లిద్దరి మీద ఎన్నో కథనాలు ప్రచారం అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా శుభ్ మన్ గిల్ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఇటీవలే ఒక ఈవెంట్ లో పాల్గొన్న అనన్య ని ఒక అభిమాని ప్రశ్న అడుగుతూ ‘విరాట్ కోహ్లీ, అనుష్క ఒక యాడ్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు, తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు శుభ్ మన్ గిల్ కూడా కలిసి యాడ్ లో నటించారు. మీరు కూడా అలా పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా?’ అని అడగగా, దానికి అనన్య సమాధానం ఇస్తూ ‘నా ఆలోచనలు, అతని ఆలోచనలు వేరే. అలాంటి ఉద్దేశ్యాలు ఏమి లేవు. యాడ్ షూటింగ్ అయ్యాక కనీసం మేము మాట్లాడుకోలేదు కూడా’ అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్.