https://oktelugu.com/

NTR Dragon: ఎన్టీయార్ డ్రాగన్ సినిమా అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న ప్రశాంత్ నీల్…

తనదైన రీతిలో సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు తెలుగులో చాలా మంది ఉన్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయిన హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన మార్కెట్ రోజురోజుకీ విస్తరింప చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : September 30, 2024 / 04:19 PM IST

    NTR Dragon

    Follow us on

    NTR Dragon: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు ముందుగా ‘నందమూరి ఫ్యామిలీ’ గుర్తుకొస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరో అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్య పోటీని తట్టుకొని మరి ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చేశాడు. ముఖ్యంగా ఆయన చేసిన అన్ని జానర్స్ సినిమాల వల్లే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల పాత్రలను పోషించిన ఆయన తనకు తానే సాటి అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత వాళ్ల ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారిలో బాలయ్య బాబు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి కూడా ఆయన చాలా వరకు ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు.

    ఇక రీసెంట్ గా రిలీజ్ ఆయన దేవర సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఎన్టీయార్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక డ్రాగన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చాలా రోజుల కిందటే రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా కూడా చాలా డార్క్ మోడ్ లో ఉండబోతుంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ దసరాను బేస్ చేసుకొని ఈ సినిమా నుంచి మరొక గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది మామూలు రేంజ్ లో ఉండదు. చాలా హై రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు కూడా దీని మీద భారీ అంచనాలైతే పెట్టుకుంటున్నాడు. మరి డ్రాగన్ కి ఆయన ఒక 30 నిమిషాల పాటు సాగే గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సైతం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఎన్టీఆర్ కూడా దానికి సంబంధించిన షూటింగ్ లోనే బిజీగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ దసరాకి డ్రాగన్ మూవీ నుంచి ఒక గ్లింప్స్ అయితే రాబోతుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఈ గ్లింప్స్ ను దసరా కి తీసుకొస్తారా లేదా అనేది…