Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత సీజన్ తో పోలిస్తే చాలా తక్కువే. గత సీజన్ లో అద్భుతమైన టాస్కులతో పాటు, ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయి. అందుకే బిగ్ బాస్ హిస్టరీ లోనే డైలీ ఎపిసోడ్స్ కి సంచలనాత్మక టీఆర్పే రేటింగ్స్ వచ్చేవి. కానీ ఈ సీజన్ కి మాత్రం యావరేజ్ రేంజ్ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. కారణం టాస్కులు పెద్దగా లేకపోవడమే. కానీ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఎంటర్టైన్మెంట్ వంటివి బాగా ఉండడంతో ఫ్లాప్ అవ్వాల్సిన సీజన్ యావరేజ్ రేంజ్ లో అయినా నిల్చింది. దానికి తోడు ఈసారి టీవీ టెలికాస్ట్ కి వచ్చిన వ్యూయర్షిప్ కంటే ఎక్కువగా హాట్ స్టార్ లైవ్ లో ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చింది. దాని ప్రభావం కాస్త గట్టిగా పడడం వల్లే టీఆర్ఫీ రేటింగ్స్ తగ్గాయి.
అయితే ఎట్టకేలకు ఈ సీజన్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంతకుముందు సీజన్స్ అన్నిట్లో ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయిల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు లిమిట్ లేదు, కంటెస్టెంట్స్ ఎంత ఆడితే అంత ప్రైజ్ మనీ అన్నట్టుగా బిగ్ బాస్ టీం ప్లాన్ చేసింది. అలా ఇప్పటి వరకు 54 లక్షల రూపాయిల వరకు వచ్చింది. వచ్చే వారం ఈ ప్రైజ్ మనీ ని పెంచుకునే టాస్కులు పెట్టబోతున్నాడట బిగ్ బాస్. ఈ టాస్కులు ప్రైజ్ మనీ ని పెంచొచ్చు, అదే విధంగా తగ్గించొచ్చు కూడా. చాలా కీలంగా మారనున్న ఈ టాస్కులు అతి క్లిష్టంగా ఉండబోతున్నాయట. వైల్డ్ కార్డ్స్ ని అడ్డుకునేందుకు బిగ్ బాస్ ఎలా అయితే ఆడలేని గేమ్స్ ఎక్కువగా ఇచ్చాడో. అలాంటి గేమ్స్ ఇవ్వబోతున్నారట. ఈ గేమ్స్ పూర్తి చేయలేకపోతే 54 లక్షలు కాస్త 20 లక్షలు అయ్యే ప్రమాదం ఉంది. అదే విధంగా టాస్కులు పూర్తి చేస్తే 54 లక్షలు కోటి రూపాయిల వరకు కూడా వెళ్లొచ్చు.
ఏదైనా కంటెస్టెంట్స్ చేతిలోనే ఉంది. మామూలుగా గత సీజన్స్ లో చివరి వారాల్లో చాలా కూల్ టాస్కులు ఉండేవి. ఆడియన్స్ ని ఓట్లు అడిగేందుకు కొన్ని టాస్కులు పెడుతారు. గెలిచినా వాళ్లకు ఆడియన్స్ ని ప్రత్యేకంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. గత సీజన్ లో ఈ టాస్కులు ఆడుతున్న సమయంలో కూడా పెద్ద గొడవలు అయ్యాయి. ముఖ్యంగా అమర్ దీప్ గ్రాఫ్ ని డౌన్ చేసి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ అయ్యేలా చేసింది. అలా ఈ వారం టాస్కులు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం తోనే గౌతమ్ విన్నర్ గా నిలబడబోతున్నాడా?, లేకపోతే నిఖిల్ విన్నర్ అవుతాడా అనేది తేలిపోనుంది. ఒకవేళ వీళ్లిద్దరు కాకుండా రోహిణి, ప్రేరణ వంటి వారికి కూడా బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్స్ పడి వాళ్ళు టైటిల్ కొట్టొచ్చేమో, ఏదైనా జరగొచ్చు, గోల్డెన్ టికెట్స్ కూడా కీలకం కాబోతుంది.