Balakrishna On Bigg Boss: తెలుగు బుల్లితెరపై ప్రభంజనం సృష్టించిన రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. ప్రతీ ఏడాది ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటి వరకు ఆరు సీజన్స్ పూర్తి చేసుకొని ఈ ఏడాదితో 7 సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది.మొదటి 5 సీజన్స్ ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యినప్పటికీ ఆరవ సీజన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
సరైన కంటెస్టెంట్స్ లేకపోవడం, దానికి తోడు న్యాయపూరితమైన ఎలిమినేషన్స్ లేకపోవడం వల్లే ఈ సీజన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.అందుకే ఈ ఏడాది ప్రసారం కాబోతున్న 7 వ సీజన్ లో అలాంటి తప్పులు లేకుండా, చాలా జాగ్రత్తగా కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశారట, ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన వాళ్ళే ఉంటారట,ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నా, అది అధికారికంగా వచ్చింది కాదు.
ఇక పోతే ఈ సీజన్ కి హోస్ట్ గా బిగ్ బాస్ యాజమాన్యం బాలయ్య బాబు ని గత కొంతకాలం గా సంప్రదిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రూమర్ ఏమో అని అందరూ అనుకున్నారు కానీ, నిజంగానే బిగ్ బాస్ టీం బాలయ్య ని సంప్రదించారట. ఇప్పటికే ఆయన ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ద్వారా తనలో ఎంత గొప్ప వ్యాఖ్యాత ఉన్నాడో అందరికీ చూపించాడు.
అప్పటి నుండి స్టార్ మా యాజమాన్యం బాలయ్య బాబు కోసం ప్రయత్నాలు చేస్తుంది, బాలయ్య అందుకు ఒప్పుకున్నాడు కానీ ఒక్కో ఎపిసోడ్ కి ఆయన పారితోషికంగా 10 కోట్ల రూపాయిలు అడుగుతున్నాడట. గతం లో అక్కినేని నాగార్జున కి దాదాపుగా ఒక్కో ఎపిసోడ్ కి మూడు కోట్ల రూపాయిలు ఇచ్చే వాళ్ళు, అదే ఎక్కువ అని అనుకుంటూ ఉంటే బాల్లయ్య ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసేలోపు ఆయనతో చెయ్యాలనే ఆలోచన పక్కన పెట్టి, దగ్గుపాటి రానా కోసం ప్రయత్నం చేస్తున్నారట.