https://oktelugu.com/

Malli Pelli OTT: ఓటీటీ లోకి నరేష్ – పవిత్ర ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం.. సెన్సార్ కట్ లేకుండా రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయట!

ఇప్పుడు ఈమెని తమ సినిమాల్లో పెట్టుకోవాలంటేనే భయపడిపోతున్నారు దర్శక నిర్మాతలు. అయితే వీళ్లకు ఉన్న నెగటివిటీ ని కూడా కమర్షియల్ గా ఉపయోగించుకునేందుకు నరేష్ వాళ్ళ లవ్ స్టోరీ మొత్తాన్ని

Written By:
  • Vicky
  • , Updated On : June 20, 2023 / 06:02 PM IST

    Malli Pelli OTT

    Follow us on

    Malli Pelli OTT: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ వస్తున్న జంట నరేష్ – పవిత్ర. మనవళ్లను ఎత్తుకొని ఆడించాల్సిన వయస్సులో పెళ్లి చేసుకున్న నరేష్ పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగటివిటీ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన నటంచిన సినిమాలను కూడా ఇష్టపడలేనంత నెగటివిటీ ని సంపాదించుకున్నాడు. మరోపక్క నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ గా గడిపిన పవిత్ర లోకేష్ కెరీర్ కూడా రిస్క్ లో పడింది.

    ఇప్పుడు ఈమెని తమ సినిమాల్లో పెట్టుకోవాలంటేనే భయపడిపోతున్నారు దర్శక నిర్మాతలు. అయితే వీళ్లకు ఉన్న నెగటివిటీ ని కూడా కమర్షియల్ గా ఉపయోగించుకునేందుకు నరేష్ వాళ్ళ లవ్ స్టోరీ మొత్తాన్ని ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేసాడు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నాకు 16 కోట్ల రూపాయిలు కూడా ఖర్చు అయ్యుంది అని చెప్పుకొచ్చాడు.

    అయితే ఈ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వచ్చింది, అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ మాత్రం భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ నెల 23 వ తారీఖు నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులో రానుంది అట. ఈ సినిమా కోసం నెటిజెన్స్ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.

    ఎందుకంటే ఈ సినిమాకి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి కాబట్టి, అసలు నరేష్ పవిత్ర మధ్య ఎలా ప్రేమ పుట్టింది, మూడవ భార్య రమ్య ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఇలాంటివన్నీ చూసేందుకు జనాల్లో ఆసక్తి ఉంది. అందుకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు కొన్ని వివాదాస్పద సన్నివేశాలు మరియు రొమాంటిక్ సన్నివేశాలను సెన్సార్ సభ్యులు కట్ చేసారు. అవి ఇప్పుడు OTT వెర్షన్ కి జత చేసి విడుదల చేస్తారట.