Sreemukhi: బుల్లితెర గ్లామర్ క్వీన్ గా శ్రీముఖి అవతరించింది. వరుస ఆఫర్స్ తో అమ్మడు సత్తా చాటుతుంది. ప్రతి కొత్త షోకి శ్రీముఖినే యాంకర్. తాజాగా ఆమె ఖాతాలో మరో షో వచ్చి చేరింది. నీతోనే డాన్స్ అంటూ సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. సీరియల్ నటులు జంటలు ఏర్పడి ఈ షోలో పాల్గొంటున్నారు. నీతోనే డాన్స్ రియాలిటీ షోకి శ్రీముఖి జడ్జిగా ఎంపికైంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం రెడ్ ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా సిద్ధమైంది. శ్రీముఖి లుక్ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. పరువాలు దగ్గరగా చూసి మాయలో పడిపోతున్నారు.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి స్టార్ గా అవతరించింది. లెక్కకు మించిన షోలు చేస్తూ సత్తా చాటుతుంది. ప్రస్తుతం శ్రీముఖి చేతిలో అరడజనుకు పైగా షోలు ఉన్నాయి. సుమ, రష్మీ కూడా శ్రీముఖితో పోటీపడలేకున్నారు. అనసూయ అయితే యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. శ్రీముఖి ఎందరో యంగ్ యాంకర్స్ కి స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఈ మధ్య గ్లామరస్ యాంకర్స్ కి డిమాండ్ పెరిగింది. తెలుగు యాంకర్స్ సైతం అందాల విందులో వెనుకాడటం లేదు. ఈ పరిణామం శ్రీముఖికి కలిసి వచ్చింది. పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన శ్రీముఖి… బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ రాబట్టింది. సీజన్ 3లో పాల్గొన్న ఆమె ఫైనల్ కి చేరింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో శ్రీముఖి టైటిల్ కోసం పోటీపడింది. అనూహ్యంగా రాహుల్ టైటిల్ విన్నర్ అయ్యాడు.
ఇక నటిగా కూడా శ్రీముఖి బిజీ అవుతున్నారు. ఆల్రెడీ ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ పట్టేస్తుంది. శ్రీముఖికి హీరోయిన్ ఆఫర్స్ వస్తున్న రిజెక్ట్ చేస్తున్నారట. చిన్నా చితకా చిత్రాల్లో నటించను అంటున్నారట. కొంచెం పేరున్న నటులు, దర్శకులతో పనిచేయడం మంచిదని భావిస్తున్నారట. చిరంజీవి భోళాశంకర్ మూవీలో శ్రీముఖి కీలక రోల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.