Kalki Teaser Review : ప్రాజెక్ట్ కే చిత్ర టైటిల్ కల్కిగా నిర్ణయించారు. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా టైటిల్ టీజర్ విడుదల చేశారు. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ లో కే అంటే కల్కి అని తెలియజేశారు. టైటిల్ కల్కి అయినప్పటికీ కథలో ప్రాజెక్ట్ కే అనేది ఒక భాగం. దీని ప్రస్తావన ఉంది. కథా నేపథ్యంలో ఇదొక భాగమని అర్థమవుతుంది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కల్కి టీజర్ విడుదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేమికులు టీజర్ కోసం నిద్రమాని ఎదురుచూశారు. వారి నిరీక్షణకు ఫలితం దక్కింది.