Bigg Boss 7 Telugu: నామినేషన్స్ డే వచ్చిదంటే కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇంటి సభ్యులు అందరూ ఒకటే అన్న బిగ్ బాస్… ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. తగు కారణాలు చెప్పి హౌస్ మేట్స్ ఎదురుగా ఉన్న కుండలను బద్దలు కొట్టాలి. పల్లవి ప్రశాంత్ తో ప్రక్రియ మొదలైంది. కెప్టెన్ అంటే ఏమిటో నీకు తెలుసు. నువ్వు నా మాట వినలేదు. ఇజ్జత్ ఇయ్యలేదన్న కారణంతో సందీప్ ని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. అందుకు సందీప్ ఒప్పుకోలేదు.
ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీ గేమ్, మాటల్లో అపరిపక్వత కనిపిస్తుందని సందీప్ అన్నాడు. పల్లవి ప్రశాంత్ సందీప్ ని నామినేట్ చేసిన నేపథ్యంలో సందీప్ తిరిగి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ఇక్కడ మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడావు. ఒకసారి ఊరోడు అన్నావని పల్లవి ప్రశాంత్ నోరు జారాడు. దీనికి సందీప్ ఫైర్ అయ్యాడు. నేను ఆ మాట అనలేదు. నేను ఎవరినీ తక్కువ భావనతో చూడను అన్నాడు.
కాదు నువ్వు అన్నావని పల్లవి ప్రశాంత్ వాదించే ప్రయత్నం చేశాడు. నేను తల్లిగా భావించే డాన్స్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నువ్వు మట్టి మీద, తినే తిండి మీద ప్రమాణం చేసి చెప్పు అని సందీప్ డిమాండ్ చేశాడు. అయితే పల్లవి ప్రశాంత్ మాట మార్చాడు. ఊరోడు అనకపోయినా నా ఊరు, గ్రామం గురించి మాట్లాడావని పల్లవి ప్రశాంత్ అన్నాడు. పల్లెటూరోడు అని అవమానించావని మొదట మాట్లాడిన పల్లవి ప్రశాంత్ తర్వాత వేరే అర్థం వచ్చేలా చెప్పాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ దొరికిపోయినట్లు అయ్యింది. ఇది సందీప్ కి ప్లస్ కాగా పల్లవి ప్రశాంత్ కి మైనస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ సెంటిమెంట్, సింపతీ వాడుకొని హౌస్లో రాణిస్తున్నాడన్న అపవాదును ఇది బలం చేకూర్చింది. ఆవేశంలో నోరు జారి పల్లవి ప్రశాంత్ బుక్ అయ్యాడు. రేపు వీకెండ్ హోస్ట్ నాగార్జున లేవనెత్తితే పల్లవి ప్రశాంత్ కి అక్షింతలు తప్పవు. ఇక నామినేషన్స్ లో భోలే, అశ్వినిలను మెజారిటీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. వారు డేంజర్ జోన్లో ఉన్నారు.