Pakistan Vs Afghanistan: వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి జట్టు కూడా తమ అధిపత్యాన్ని చూపించుకుంటూ ప్రతి మ్యాచ్ లో గెలవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని జట్లు మాత్రమే ఇక్కడ విజయాన్ని సాధిస్తున్నాయి మిగతా అన్ని జట్లు కూడా ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాయి. అయితే ఇక్కడ ఏ జట్టు విజయం సాధిస్తుందన్నది పక్కగా చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ఇంగ్లాండ్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మొన్న జరిగిన మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లాండ్ టీమ్ ఆఫ్గనిస్తాన్ టీమ్ మీద దారుణం గా ఓడిపోయింది.
ఆఫ్గాన్ బౌలర్ల ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ తేలిపోయారు. ఇక దాంతో ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు అక్టోబర్ 23వ తేదీన పాకిస్థాన్ ఆఫ్గనిస్తాన్ టీమ్ లా మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది.ఈ మ్యాచ్ లో అఫ్గాన్ టీమ్ ని ఎలా ఓడించాలి అనేది పాకిస్తాన్ కి అర్థం కావడం లేదు.మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది.కాబట్టి అక్కడ ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశం గా మారింది. ఇక ఆ పిచ్ మీద అఫ్గాన్ టీమ్ ని ఎలా ఓడించాలి అనే దాని మీద పాకిస్తాన్ టీం ఇప్పటికే చాలా కసరత్తులు చేస్తుంది. ఈ టైంలో పాకిస్తాన్ టీం ఇప్పటికీ రెండు మ్యాచ్ ల్లో గెలిచినప్పటికీ అవి కూడా నెదర్లాండ్ ,శ్రీలంక ల మీద కావడంతో తనకంటే బలహీనమైన జట్ల మీద మాత్రమే పాకిస్థాన్ గెలుస్తుంది తప్ప స్ట్రాంగ్ గా ఉన్న టీమ్ ల మీద గాని, తనకంటే అధికం బలం కలిగిన టీములతో గాని గెలవడం లేదు అనే విమర్శ ని అయితే ఎదురుకుంటుంది. అయితే ఇలాంటి టైం లో పాకిస్తాన్ టీం, ఆఫ్గనిస్తాన్ టీం మీద గెలిచి తమ అధిపత్యాన్ని చూపించుకోవాలని చూస్తుంది. వాస్తవానికి పాకిస్థాన్ టీమ్ తో పోల్చుకుంటే అఫ్గాన్ పెద్ద టీమ్ అయితే కాదు, కానీ ఆ టీమ్ వరల్డ్ కప్ లో అద్భుతాలు చేస్తుంది వాళ్ల ఫామ్ ముందు ప్రస్తుతం ఉన్న పాకిస్థాన్ టీమ్ చాలా చిన్నది అనే చెప్పాలి…ఇక ఇదే క్రమం లో ఆఫ్గనిస్తాన్ టీం కూడా పాకిస్థాన్ ని ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయాలని చూస్తుంది.
ఇక ఇలాంటి సిచువేషన్ లో ఈ రెండు టీముల్లో ఎరిది పై చేయి అవుతుంది అనేది కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశం గా మారింది. ఇప్పటికే అఫ్గాన్ టీంలో రషీద్ ఖాన్ ,ముజుబుర్ రహమాన్, నబీ లాంటి ప్లేయర్లు వాళ్ళ టాలెంట్ తో వాళ్ల టీం కి విజయాలను అందించే ప్రాసెస్ లో ఉన్నారు. ఇక ఈ టైంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ అఫ్గాన్ స్పిన్నర్లని ఎదుర్కొంటారా లేదా అనేది కూడా చూడాలి. ఇంక దానికి తోడుగా ఆఫ్గనిస్తాన్ టీం పాకిస్తాన్ ప్లేయర్లని బోల్తా కొట్టించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ క్రికెట్ మేధావులు సైతం వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… పాకిస్తాన్ జట్టు ఇప్పటికే ఇండియా మీద ఘోర పరాజయాన్ని పొందడంతో పాకిస్తాన్ టీం లో ఒక రకమైన భయం నెలకొంది. ఇక అఫ్గాన్ టీమ్ మీద కనక పాకిస్తాన్ ఓడిపోయినట్టు అయితే సెమీస్ కి చేరడం చాలా కష్టం అవుతుంది….