Bigg Boss 7 Telugu: వాడో ఫేక్ ప్లేయర్, బయటకు లాక్కురావాలి… ఆ కంటెస్టెంట్ ని ఏకిపారేసిన సందీప్ మాస్టర్!

'ఒక మనిషి అక్కడ లేనప్పుడు .. ఆ మనిషి గురించి అబద్ధం చెప్పడం చాలా తప్పు. ఈ పాయింట్ ఒకటి చాలు.. తేజా ని బయటకు లాక్కుని రావడానికి. తేజ ఫేక్ అనడానికి ఇదే నిదర్శనం.

Written By: NARESH, Updated On : November 2, 2023 11:12 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు సందీప్ మాస్టర్. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్… ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు అంటూ సందీప్ ని నామినేట్ చేశాడు తేజ. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో షాక్ అయ్యారు. కాగా నిన్నటి నామినేషన్స్ లో శివాజీ ‘నువ్వు నామినేట్ చెయడం వల్ల ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ అయిపోయాడు’ అని తేజ ని నామినేట్ చేశాడు. దానికి తేజ ఒక మాట చెప్పాడు. ‘మాస్టరే తనని నామినేట్ చేయమని అడిగాడు.. అందుకే నామినేట్ చేశా అని అన్నాడు. అయితే తేజ అబద్దాలు ఆడుతున్నాడు.. అతనో ఫేక్ అంటూ సందీప్ చెప్పాడు.

‘ఒక మనిషి అక్కడ లేనప్పుడు .. ఆ మనిషి గురించి అబద్ధం చెప్పడం చాలా తప్పు. ఈ పాయింట్ ఒకటి చాలు.. తేజా ని బయటకు లాక్కుని రావడానికి. తేజ ఫేక్ అనడానికి ఇదే నిదర్శనం. నేను స్ట్రాంగ్ అని నామినేట్ చేశాడు. అతని పాయింట్ ఓకే .. నేను యాక్సెప్ట్ చేశాను. తేజ నామినేట్ చేస్తే ఆరుగురు వెళ్లిపోయారు. జనాలు డిసైడ్ చేశారు కాబట్టి .. నేను యాక్సెప్ట్ చేశా. కానీ నేను అక్కడ లేనప్పుడు. నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. నేనే నామినేట్ చేయమన్నాను అని అబద్ధాలు చెబుతున్నాడు.

ఇప్పుడు అర్జున్ ని కూడా సేమ్ రీజన్ తో నామినేట్ చేశాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కోసం నామినేట్ చేస్తున్న అంటూ వెటకారం చేస్తున్నాడు. చాలా స్వార్ధపరుడిగా ఆడుతున్నాడు తేజ. నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా సీరియస్ విషయం. కానీ దాన్ని చాలా సిల్లీగా చేసి పారేశాడు.

నేను ఎలిమినేట్ అయిపోతే సోఫా లో పడి దొర్లాడు. వాడు ఏడుస్తున్నాడో .. నవ్వుతున్నాడో తెలియలేదు. నేను బయటకు వస్తుంటే అంత ఏడ్చిన తేజ .. ఇప్పుడు నా గురించి అబద్ధాలు చెప్పడాన్ని ఆడియన్స్ గమనించాలి అంటూ తేజ పై సంచలన కామెంట్స్ చేశాడు సందీప్. తేజ త్వరగా ఎలిమినేట్ అయిపోవాలని సందీప్ కోరుకుంటున్నాడని క్లియర్ గా అర్థం అవుతుంది. కాగా ఈ వారం నామినేషన్స్ లో తేజ ఉన్న విషయం తెలిసిందే. సందీప్ కామెంట్స్ అతని ఓటింగ్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి…