https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాల్లో ఆయన కొడుకుకి నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక 'పుష్ప 2' సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో పెను రికార్డులను కూడా సృష్టిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 09:46 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరో అల్లు అర్జున్… ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి… ఇక ఇప్పుడు ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయన ‘పుష్ప 2’ సినిమా లుక్ నుంచి బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక నాలుగో సినిమాగా రాబోతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఉంది. కాబట్టి మరోసారి ఈ కాంబినేషన్ భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక పుష్ప 2 సినిమాతో దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టబోతున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కొడుకు అయిన ‘అల్లు అయాన్’ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటాడు. నిజానికి ఆయన వరుస సినిమాలను చూస్తూ ఈ సినిమా బాగుంది ఈ సినిమా బాలేదు అనే జడ్జిమెంట్ కూడా చేస్తూ ఉంటాడని రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఒక సందర్భంలో తెలియజేశాడు.

    మరి ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాల్లో అతనికి నచ్చిన సినిమా ఏంటి అని అడగగా ఆయన ‘సరైనోడు ‘ సినిమా అంటే తనకి చాలా ఇష్టమని తెలియజేశాడు. నిజానికి మొదటిసారి అల్లు అర్జున్ మాస్ అవతారమెత్తి చేసిన సినిమా సరైనోడు…

    ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు మాస్ లో మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. మన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావత్ తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టింది… ఇక ఆ సినిమానే తనకు నచ్చడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి…