https://oktelugu.com/

Prabhas : ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ అందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ తక్కువ గ్యాప్ లోనే మూడు నాలుగు సినిమా లను విడుదల చేస్తున్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : December 30, 2024 / 12:59 PM IST

    Ram Charan , Jr. NTR follow Prabhas Formula

    Follow us on

    Prabhas :  పాన్ ఇండియా లెవెల్ లో డార్లింగ్ ప్రభాస్ కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన క్రేజ్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయాయి. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ అందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ తక్కువ గ్యాప్ లోనే మూడు నాలుగు సినిమా లను విడుదల చేస్తున్నారు. ప్రభాస్ నటించిన రాదే శ్యామ్, ఆది పురుష్,సలార్ సినిమాలు తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. ఇక 2024లో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హీట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రభాస్ ఫాలో అవుతున్న ఇదే ఫార్ములా ను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమా షూటింగ్ చివరి దశకు రాగానే రామ్ చరణ్ బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు అతి తక్కువ గ్యాప్ లోనే ప్రకటించడం జరిగింది. ఒకవైపు గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే రామ్ చరణ్ తన RC16 రెగ్యులర్ షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రామ్ చరణ్ తన పూర్తి ఫోకస్ ను బుచ్చిబాబు సినిమా మీద పెట్టనున్నారు. 2025 జూన్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

    ఇక ఆ తర్వాత 2025 డిసెంబర్ నుంచి రామ్ చరణ్ సుకుమార్ సినిమా మొదలుకానుంది. తక్కువ గ్యాప్ లోనే రామ్ చరణ్ నటించిన ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రభాస్ మరియు రామ్ చరణ్ ఫాలో అవుతున్న ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ దేవరతో పాటే వార్ 2 కి కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక దేవర సినిమా విడుదల అయిన వెంటనే వార్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఎన్టీఆర్.

    2025 సమ్మర్ లోపే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయ్యేలోపే దేవర 2 స్క్రిప్ట్ రెడీ చేయనున్నారు దర్శకుడు కొరటాల. తక్కువ గ్యాప్ లోనే వరస ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటే ఎంత అడ్వాంటేజ్ ఉందో హీరో ప్రభాస్ చూపించారు. ప్రస్తుతం ప్రభాస్ ఫాలో అవుతున్న అదే రూట్ లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు.