spot_img
Homeఎంటర్టైన్మెంట్Varun Tej and Sai Pallavi: అందుకే మళ్ళీ సాయి పల్లవితో నటించలేదన్న వరుణ్ తేజ్!

Varun Tej and Sai Pallavi: అందుకే మళ్ళీ సాయి పల్లవితో నటించలేదన్న వరుణ్ తేజ్!

Varun Tej and Sai Pallavi: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది ఫిదా. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో క్లాసిక్. సాయి పల్లవిని (Sai Pallavi) ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఫిదా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అమెరికా అబ్బాయి పాత్రలో వరుణ్ తేజ్ చాలా సెటిల్డ్ గా నటించారు. ఆయన మేనరిజం, డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు చక్కగా కుదిరాయి. ఇక తెలంగాణ పల్లెటూరి అల్లరి పిల్లగా సాయి పల్లవి మెస్మరైజ్ చేసింది. ఫిదా మూవీలో సాయి పల్లవి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.

వరుణ్ తేజ్-సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ సైతం చక్కగా కుదిరింది. ఫిదా విడుదలై చాలా ఏళ్ళు అవుతుంది. మరోసారి వరుణ్, సాయి పల్లవి కలిసి నటించలేదు. సాధారణంగా హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి. కానీ వీరు రిపీట్ చేయలేదు. సాయి పల్లవితో మరో సినిమా చేయకపోవడానికి రీజన్ ఏమిటో తాజాగా వరుణ్ తేజ్ వెల్లడించాడు. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సాయి పల్లవితో ఒక మూవీ చేయాల్సింది. ఇద్దరం కథ కూడా విన్నాము. అందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే నెక్స్ట్ మా నుండి చిత్రం వస్తే అది ఫిదా ను మించి ఉండాలి. అందుకే సాయి పల్లవితో మరో సినిమా చేయలేదు… అని చెప్పుకొచ్చాడు. సాయి పల్లవి నానితో మాత్రమే రెండు చిత్రాలు చేసింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ వార్ డ్రామా మార్చి 1న విడుదల కానుంది.

ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో యుద్ధ విమానాలు నడిపే పైలట్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కి జంటగా మానుషీ చిల్లర్ నటిస్తుంది. రుహాని శర్మ ఓ కీలక రోల్ చేస్తుంది. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి.

Exit mobile version