https://oktelugu.com/

Rahul Gandhi: కేరళలో వేడెక్కిన రాజకీయాలు, రాహుల్ గాంధీ పోటీపై సందిగ్థత

కేరళలో వేడెక్కిన రాజకీయాలు.. రాహుల్ గాంధీ పోటీపై సందిగ్థత నెలకొంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2024 / 12:15 PM IST

    కేరళ.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయి. ఈరోజు మోడీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ముగింపు సభలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ తాజాగా వాయనాడ్ సీటుపై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. నంబర్ 3 పినరయి విజయన్ కూతురు వీణ విషయంలో కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి.

    అన్నామలై పాదయాత్రను గురించే మనం మాట్లాడుకుంటున్నాం.. నెల రోజుల క్రితం జనవరి 27వ తేదీ కాసరగోడు నుంచి కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ ముగింపు సభ త్రివేండ్రంలో ఈరోజు జరుగుతోంది. దీనికి మోడీ హాజరవుతున్నారు. కాకపోతే అన్నామలై అంత ప్రభావం రాకపోయినా.. ఎంతో కొంత కేరళలో అయితే బీజేపీ ఊపు వచ్చింది. కేరళలో చాలా డిఫెరెన్స్ ఉంది.

    కేరళలో ఉదయం సభకు హాజరైన తర్వాత ఇక్కడి నుంచి పల్లడం తిరుపూర్ కు వెళ్లి అక్కడ అన్నామలై ముగింపు పాదయాత్రలో ప్రసంగిస్తారు.

    ఈ సంవత్సరం ఇప్పటికే దక్షిణాదిలో నరేంద్రమోడీ 3వ పర్యటన. దక్షిణాదికి ఎంత ఇంపార్టెన్స్ ను మోడీ ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

    కేరళలో వేడెక్కిన రాజకీయాలు.. రాహుల్ గాంధీ పోటీపై సందిగ్థత నెలకొంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.