Star Heroine: ఈ ముగ్గురిని స్టార్ హీరోలుగా మార్చడంలో కీలకపాత్ర వహించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అప్పట్లో ఇండస్ట్రీ లో భారీ సక్సెస్ లను అందుకోవాలంటే అది కేవలం స్టార్ హీరోల వల్లే అవుతుందని అందరూ అనుకునేవారు. హీరోయిన్లను అసలు పట్టించుకునే వారే కాదు.

Written By: Gopi, Updated On : February 27, 2024 12:00 pm
Follow us on

Star Heroine: అప్పట్లో సినిమా అంటే ఒక స్టార్ హీరో మాత్రమే మనకు కనిపించేవాడు. ఆయనను చూసే అభిమానులు థియేటర్ కి వచ్చి సినిమాలు చూసి వాటిని సక్సెస్ లు గా మారుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడున్న రోజుల్లో కథలను బేస్ చేసుకొని దర్శకుడిని చూసి కూడా ఆడియన్స్ థియేటర్ కి వస్తున్నారు. కంటెంట్ బాగుంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ల తో సంబందం లేకుండా సినిమాలు సూపర్ హిట్లు గా నిలుస్తున్నాయి…

ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఇండస్ట్రీ లో భారీ సక్సెస్ లను అందుకోవాలంటే అది కేవలం స్టార్ హీరోల వల్లే అవుతుందని అందరూ అనుకునేవారు. హీరోయిన్లను అసలు పట్టించుకునే వారే కాదు. వాళ్ళ క్యారెక్టర్ ఎంతసేపు అందాల ఆరబోతకు, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారు. కానీ పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన ముగ్గురు హీరోలను స్టార్ హీరోలుగా మార్చడం లో ఒక హీరోయిన్ కీలక పాత్ర వహించందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ హీరోయిన్ ఎవరు అంటే అందమైన బాపు బొమ్మల ఉండే భూమిక… ఆమె అందాల ఆరబోత క్యారెక్టర్ లను చేయకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేసేది దానివల్లే ఆమె ఇండస్ట్రీ లో మిగితా హీరోయిన్ల కంటే స్పెషల్ గా మారింది…

ఇక ఇది ఇలా ఉంటే మెగాస్టార్ తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకి ముందు వరుకు సూపర్ హిట్ లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఖుషి సినిమా వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ హిట్ ని సాధించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పుడు టాప్ లో ఉన్న చిరంజీవి లాంటి స్టార్ హీరో కి సైతం పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. అయితే అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ హిట్ అయితే దక్కలేదు. కానీ ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కడం లో హీరోయిన్ భూమిక కీలకపాత్ర వహించింది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ లో డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంలో కీలకపాత్ర వహించింది.

ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అప్పటివరకు ఆరు సినిమాలు చేసినప్పటికీ అందులో రాజకుమారుడు, మురారి మాత్రమే సక్సెస్ సాధించాయి. మిగిలిన నాలుగు సినిమాలు భారీ ఫ్లాపులుగా మిగిలాయి. దాంతో ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు గుణశేఖర్ డైరెక్షన్ లో ఒక్కడు సినిమా చేశాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో కూడా భూమికనే హీరోయిన్ గా నటించడం విశేషం..ఘట్టమనేని వారసుడికి కూడా భూమికనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది…

నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీ కి వచ్చిన ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నప్పటికీ అతన్ని మాస్ హీరోగా అలాగే ‘యంగ్ టైగర్ ‘ గా మార్చిన సినిమా మాత్రం సింహాద్రి సినిమానే…ఈ మూవీలో కూడా భూమిక నే హీరోయిన్ గా నటించి నందమూరి చిన్నోడికి కూడా ఒక అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది…

ఇలా మూడు పెద్ద ఫ్యామిలీలా నుంచి వచ్చిన ముగ్గురు హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన సినిమాల్లో భూమిక హీరోయిన్ గా నటించడమే కాకుండా, ఒక సినిమా సక్సెస్ లో హీరోయిన్ ప్రాధాన్యత ఎంతలా ఉంటుందో తెలియజేసింది…