Guntur Kaaram : గుంటూరు కారం నుండి అందుకే పూజాను తప్పించాం… అసలు మేటర్ ఇదన్నమాట!

తాజా ఇంటర్వ్యూలో గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టత ఇచ్చారు. పూజా ప్లాప్స్ లో ఉన్న నేపథ్యంలో అందుకే తీసేశారా? అని అడగ్గా...

Written By: NARESH, Updated On : October 6, 2023 8:40 pm

mahesh

Follow us on

Guntur Kaaram : పూజా హెగ్డే గుంటూరు కారం చిత్రం నుండి తప్పుకోవడం ఊహించని పరిణామం. ఆమె కెరీర్ కి ప్రతికూలం కూడా. ప్లాప్స్ లో ఉన్న హీరోయిన్ అంత పెద్ద ప్రాజెక్ట్స్ వదులుకోవాలని అనుకోదు. కమ్ బ్యాక్ కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి… చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా… ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. గుంటూరు కారం పూజా వదిలేయడానికి ప్రధాన కారణంగా శ్రీలీల అని వినిపించింది. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీలను మెయిన్ చేసి, పూజా పాత్ర ప్రాధాన్యత తగ్గించారనేది ఇండస్ట్రీ టాక్.

తాజా ఇంటర్వ్యూలో గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టత ఇచ్చారు. పూజా ప్లాప్స్ లో ఉన్న నేపథ్యంలో అందుకే తీసేశారా? అని అడగ్గా… పూజా హెగ్డే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ ఇచ్చామని నాగ వంశీ అన్నారు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆఫర్స్ ఇచ్చింది లేదన్నాడు. అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ముందు పూజా హెగ్డే మొహంజొదారో వంటి చిత్రాలు చేసే వచ్చింది.

మేము జనవరిలో గుంటూరు కారం స్టార్ట్ చేశాము. మరలా నాలుగు నెలలు బ్రేక్ పడింది. దాంతో పూజా హెగ్డే డేట్స్ ఇష్యు వచ్చింది. అందుకే ఆమె చేస్తున్న చిత్రాలు డిస్ట్రబ్ కాకూడదు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదని చెప్పి తొలగించడం జరిగింది. గుంటూరు కారం ఆఫర్ పోవడం వలన ఇతర చిత్రాల్లో కూడా ఆమెకు ఛాన్స్ లు మిస్సయ్యాయని అనడంలో నిజం లేదన్నారు. నాగవంశీ వివరణ ప్రకారం కేవలం డేట్స్ కుదరక పూజా హెగ్డే గుంటూరు కారం వదులుకుంది.

నాగ వంశీ నిర్మాణంలో పూజా హెగ్డే అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలు చేసింది. ఆమె కెరీర్ ని నిలబెట్టిన చిత్రాలుగా వీటిని చెప్పొచ్చు. అరవింద సమేతకు ముందు పూజా నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్. అయినా దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ వంటి స్టార్ పక్కన ఛాన్స్ ఇచ్చి ఆమెకు అండగా నిలిచాడు.