Bigg Boss 8 Telugu: మరో రెండు రోజుల్లో ‘బిగ్ బాస్ 8’ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ సీజన్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అలా అని ఫ్లాప్ కూడా కాలేదు. ఎదో ఒక మోస్తరుగా లాగేసింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లెకపొయ్యుంటే, అసలు ఈ సీజన్ ని 75 రోజులకే ముగించేవారు. అంత చెత్త సీజన్ అని చెప్పొచ్చు. వైల్డ్ కార్డు ద్వారా లోపలకు వచ్చిన గౌతమ్, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వంటి వారు ఈ సీజన్ ని నిలబెట్టేసారు. ముఖ్యంగా గౌతమ్ అయితే గేమ్ చేంజర్ గా మారిపోయాడు. అసలు మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన ఈయన, టైటిల్ విన్నింగ్ రేస్ లోకి వచ్చాడంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈయన ఆట తీరు ఏ రేంజ్ లో ఉన్నిందో. సోషల్ మీడియా లో జరిగే అత్యధిక పోలింగ్స్ లో గౌతమ్ నేడు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు.
అయితే యూట్యూబ్ పోలింగ్స్ ని చాలా వరకు నమ్మొచ్చు అని అంటుంటారు విశ్లేషకులు. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడానికి యూట్యూబ్ పోల్స్ శాంపిల్స్ సరిపోతాయని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే దేశం లో అత్యధిక శాతం మంది యూట్యూబ్ ని వాడుతుంటారు. ఈ పోల్స్ ని ఎవ్వరూ మ్యానిప్యులేట్ చేయలేరు. వీటిల్లో నిఖిల్ గౌతమ్ మీద ఊహించని రేంజ్ మార్జిన్ తో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ఇంస్టాగ్రామ్ లో నిర్వహిస్తున్న పోల్స్ ని చూస్తుంటే గౌతమ్ నిఖిల్ మీద అదే స్థాయి భారీ మార్జిన్ తో నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు. ఇక ట్విట్టర్ మరియు వెబ్ సైట్ పోల్స్ లో కూడా గౌతమ్ కనీవినీ ఎరుగని రేంజ్ తేడా తో లీడింగ్ లో ఉన్నాడు. వీటిల్లో ఏది నమ్మాలి?, యూట్యూబ్ పోల్స్ ని నమ్మాలా?, లేదా ఇంస్టాగ్రామ్ పోల్స్ ని నమ్మాలా? అనేది ఆడియన్స్ కి అర్థం కావడం లేదు.
ఇంస్టాగ్రామ్ పోల్స్ కూడా యూట్యూబ్ పోల్స్ లాగానే ఎవ్వరూ మ్యానిప్యులేట్ చేయలేరు. ఎప్పుడు లేని విధంగా పోలింగ్స్ లో ఇలాంటి వింత ఫలితాలు వస్తున్నాయి. దీని కారణంగా టైటిల్ విన్నర్ ఎవరో చెప్పడం చాలా కష్టమైపోయింది. అధికారిక పోలింగ్స్ వివరాలు ఈసారి బయటకి వచ్చే అవకాశాలే లేవట. అంత స్ట్రిక్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ హిస్టరీ లో విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి చివరి వారం వరకు ఎదురు చూసే పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. ఇంత టఫ్ ఫైట్ ఎప్పుడూ జరగలేదని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టార్ మా టీం మాత్రం నిఖిల్ ని విన్నర్ ని చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుందని విశ్వసనీయవర్గాల నుండి అందుతున్న సమాచారం. సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్థక్ ఈ విషయాన్ని స్వయంగా తన నోటితోనే చెప్పడం గమనార్హం. మరి ఏమి జరగబోతుందో చూడాలి.