లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన ప్రముఖులు !

‘కిమ్ శర్మ’ అందంతో పాటు అదృష్టం ఉన్నా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ తో అలరించే ఈ భామకు మొత్తానికి ఒక తోడు దొరికింది. 2010లో కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పంజానిని కిమ్ శర్మ పెళ్లాడింది. అయితే, అలీ.. ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. ఆర్ధికంగా అలాగే అన్ని రకాలుగా ఆమెకి టార్చర్ చూపించాడు. దాంతో 2016లో అతని నుండి ఆమె విడిపోయింది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న కిమ్ […]

Written By: admin, Updated On : August 5, 2021 4:46 pm
Follow us on

‘కిమ్ శర్మ’ అందంతో పాటు అదృష్టం ఉన్నా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ తో అలరించే ఈ భామకు మొత్తానికి ఒక తోడు దొరికింది. 2010లో కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పంజానిని కిమ్ శర్మ పెళ్లాడింది. అయితే, అలీ.. ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. ఆర్ధికంగా అలాగే అన్ని రకాలుగా ఆమెకి టార్చర్ చూపించాడు. దాంతో 2016లో అతని నుండి ఆమె విడిపోయింది.

ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న కిమ్ శర్మకి ఒక తోడు కావాలనిపించింది. మధ్యలో ఓ హిందీ దర్శకుడిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడింది. కానీ ఆ దర్శకుడు మాత్రం కిమ్ తో కొన్ని నెలలు పాటు సహజీవనం చేసి.. పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ, తాజాగా కిమ్ కి ఒక తోడు దొరికాడు. మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో పడింది.

ప్రస్తుతం లియాండర్ పేస్ తోనే కిమ్ కలిసి ఉంటుంది. విదేశాలలో వీరిద్దరూ రెస్టారెంట్లు, పబ్ లు అన్న తేడా లేకుండా తెగ తిరిగేస్తూ ఫోటోలకు తెగ ఫోజులు ఇస్తున్నారు. కాగా వీరిద్దరి ఫోజులు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. తమ ప్రేమ సంగతి పోస్టులు పెడుతూ బహిర్గతం చేసారు. మొత్తమ్మీద లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు వీరిద్దరూ.

ఏది ఏమైనా కిమ్ శర్మ సినిమాలతో కన్నా తన రిలేషన్ షిప్ ల వల్లే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది. అన్నట్టు ఆ మధ్య కాలంలో మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా కిమ్ శర్మ ప్రేమాయణం నడిపింది. ఎక్కడికి వెళ్లినా యువీ – కిమ్ అప్పట్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కానీ ఆ తర్వాత అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ 2007లో విడిపోయారు. ఖడ్గం సినిమాతో కిమ్ శర్మ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.