https://oktelugu.com/

Brahmanandam : నేను సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం అదే : బ్రహ్మానందం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 03:23 PM IST

    Brahmanandam

    Follow us on

    Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న బ్రహ్మానందం కూడా స్టార్ కమెడియన్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక కొన్ని సినిమాలు ఆయన వల్లే సూపర్ సక్సెస్ అయ్యాయనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కామెడీలో తనను బీట్ చేసే నటుడు మరొకరు లేరనే అంతలా గుర్తింపుని సంపాదించుకున్న బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో చాలావరకు సినిమాలు చేయడం తగ్గించాడు. ఇక తన కొడుకు అయినా రాజ్ గౌతమ్ తో కలిసి ‘ బ్రహ్మా ఆనందం’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో గౌతమ్, బ్రహ్మానందం ఇద్దరు తాత మనవడుగా నటిస్తున్నారు. ఇక నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయిన వీళ్లు స్క్రీన్ మీద తాతా మనవలుగా కనిపించడం పట్ల బ్రహ్మానందం గారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న బ్రహ్మానందం పలు ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించాడు. ఇక రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఇలాంటి సినిమాలు చేయడం తను చాలా అదృష్టంగా భావిస్తానని చెప్పాడు.

    ఇక ఒక రిపోర్టర్ అయితే మీరు ఈ మధ్య సినిమాలు చేయడం బాగా తగ్గించారు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు బ్రహ్మానందం సమాధానం చెబుతూ ఒకప్పుడు నేను చేసిన కామెడీకి జనాలు పగలబడి నవ్వారు. ఇప్పుడు నేను కామెడీ చేస్తే నవ్వు రావడం లేదు అంటూ ఒక నటుడు చేసిన కామెంట్లు గురించి మనందరికీ తెలిసిందే.

    ఇక అందుకే నేను సినిమాలు తగ్గించాను. ఇక నేను సినిమాలు చేయకపోవడానికి అదొక కారణం అయితే ఏజ్ కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఏజ్ ను కూడా దృష్టిలో పెట్టుకొని మనం మెదిలితే మంచిదని సినిమాలు చేయడం లేదు. అంతే తప్ప నాకు అవకాశాలు రాక కాదు, నేను చేయలేక కాదు. ఇప్పటికి చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ వద్దనుకొని వదిలేస్తున్నాను. ఏదైనా సరే కొంతవరకు చేసి ఆపితే బాగుంటుంది. అంతకుమించి కూడా చేయాలి అనుకుంటే అది పొరపాటు అవుతుంది అంటూ ఆయన చాలా సెటిల్డ్ గా సమాధానం చెప్పాడు.

    మరి మొత్తానికైతే ‘బ్రహ్మా ఆనందం’ టీజర్ చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా బ్రహ్మానందం కు మంచి క్యారెక్టర్ అయితే చేసే అవకాశం దక్కిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర చేసే అవకాశం రావడం నిజం గా గ్రేట్ అనే చెప్పాలి…