https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : మహేష్ బాబు కోసం మరోసారి కథలో కొన్ని మార్పులు చేస్తున్న రాజమౌళి… ఇంతకీ ఆ చెంజేస్ ఏంటి..?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి రొటీన్ రొట్ట ఫార్ములాలో వచ్చే సినిమాలు మాత్రమే గుర్తుకొచ్చేవి... కానీ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర మారిపోయిందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 03:28 PM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి రొటీన్ రొట్ట ఫార్ములాలో వచ్చే సినిమాలు మాత్రమే గుర్తుకొచ్చేవి… కానీ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర మారిపోయిందనే చెప్పాలి. ఆయన చేసిన ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వైవిద్య భరితమైన సినిమాలు వస్తాయి అని ప్రూవ్ చేసింది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ను దాటి ప్లాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా పాన్ వరల్డ్ లో ఈ సినిమాకి భారీగా నెగెటివిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి అక్కడి స్టాండర్డ్ ని ఫాలో అవుతూనే సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాలి కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ సినిమా విషయంలో రాజమౌళి పప్పులో కాలేసినవాడవుతాడు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబుకి అనుకూలంగా కొన్ని సీన్లను మార్చాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక దానికోసమే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో కొన్ని మార్పులు చేర్పులను చేస్తూ రాజమౌళి తనకు అనుకూలంగా స్క్రీన్ ప్లేని రాసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి స్క్రీన్ ప్లే రాసుకునే సమయంలో కథలో కొన్ని ఎలిమెంట్స్ తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.

    కాబట్టి అలాంటి సందర్భంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రచయితను అడగాల్సిన అవసరం లేకుండా తనకు ఎలా అయితే సీన్ కన్వే అవుతుందో అలాంటి వే లోనే స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసుకొని ముందుకు సాగుతుంటారు… మరి ఇప్పటివరకు మహేష్ బాబు కి పాన్ వరల్డ్ లో ఎలాంటి ఇమేజ్ అయితే లేదు. ఇది కేవలం రాజమౌళి సినిమా అనే ఈ మూవీ మీద మంచి హైప్ అయితే పెంచుకుంటున్నారు.

    మరి ఈ హైప్ ని అందుకుంటూ ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…