https://oktelugu.com/

Indian 3 : ‘ఇండియన్ 3’ తో నా సత్తా ఏంటో మరోసారి అందరికీ చూపిస్తా అంటూ డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్!

మూడు దశాబ్దాల క్రితమే మన సౌత్ ఇండియన్స్ గర్వపడే సినిమాలు ఎన్నో చేసాడు డైరెక్టర్ శంకర్. జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ , రోబో ఇలా ఒక్కటా రెండా ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రం ఒక ఆణిముత్యమే.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 03:17 PM IST

    Indian 3

    Follow us on

    Indian 3 : మూడు దశాబ్దాల క్రితమే మన సౌత్ ఇండియన్స్ గర్వపడే సినిమాలు ఎన్నో చేసాడు డైరెక్టర్ శంకర్. జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ , రోబో ఇలా ఒక్కటా రెండా ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రం ఒక ఆణిముత్యమే. ఐ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది కానీ, ఆ సినిమా కాన్సెప్ట్ ని తీసుకొని రీసెంట్ గానే హాలీవుడ్ లో ‘సబ్ స్టాన్స్’ అనే సినిమా చేసారు. కమర్షియల్ గా ఈ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ అయ్యింది. ఎన్నో అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంటుంది. అలాంటి స్టాండర్డ్స్ ని ఏర్పాటు చేసిన గొప్ప దర్శకుడు ఆయన. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ‘స్నేహితుడు’ చిత్రం దగ్గర నుండి శంకర్ గ్రాఫ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పాతాళ లోకంలోకి పడిపోయింది.

    భారీ అంచనాల నడుమ విడుదలైన ‘2 పాయింట్ O’ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ, ఆ సినిమా కాన్సెప్ట్ ని చూసి శంకర్ పని ఇక అయిపోయింది, రాబోయే సినిమాలతో అడ్డంగా దొరికేస్తాడు అని విశ్లేషకులు అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ‘ఇండియన్ 2 ‘ చిత్రానికి శంకర్ అడ్డంగా దొరికేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అంతే కాదు దర్శకుడిగా శంకర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేసింది ఈ చిత్రం. ఇంత చెత్తగా డైరెక్టర్ శంకర్ మళ్ళీ ప్లాన్ చేసుకొని తీయాలన్నా తీయలేడు..అసలు ఈ సినిమాకి నిజంగా డైరెక్టర్ అతనేనా అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రోల్ మెటీరియల్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా ఒక రేంజ్ లో నెగటివ్ టాక్ వచ్చింది.

    సినిమా ఇండియన్ 2 రేంజ్ లో దరిద్రంగా లేకపోయినా పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ రామ్ చరణ్ స్టాండర్డ్స్ కి తగ్గ సినిమా కాకపోవడంతో కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిల్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తున్న ఈ సినిమాపై శంకర్ మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్ నాకు కూడా పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదు. షూటింగ్ పూర్తి అయ్యాక 5 గంటల ఫుటేజి వచ్చింది. నిర్మాత దిల్ రాజు గారు మూడు గంటల లోపే సినిమా ఉండాలని చాలా బలంగా కోరుకున్నాడు. అందుకే 2 గంటల 45 నిమిషాలకు కుదించాము. అందువల్ల చాలా డిటైలింగ్స్ మిస్ అయ్యాయి. అందుకే నెగటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం నా దృష్టిని మొత్తం ఇండియన్ 3 కి మరలించాను. ఈ చిత్రం తో దేశం మొత్తానికి మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు శంకర్.