Tollywood : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గా రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న అని అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటారో ఎప్పుడు డౌట్ ఫాల్ అయిపోతారో ఎవ్వరు చెప్పలేరు. కారణం ఏదైనా కూడా ఇక్కడ అన్నింటికీ కాంప్రమైజ్ అయి సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తేనే ఇండస్ట్రీలో మంచి పేరు అయితే వస్తుంది. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేయాలని తద్వారా లిప్ లాక్ లకు గాని ఎక్స్పోజింగ్ సీన్లను గాని చేయలేనని మడిగట్టుకు కూర్చోవడంతో ఆ అమ్మాయిని పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారు. లేకపోతే ఆమె దాదాపు ఒక పది సినిమాల్లో కనిపించి స్టార్ హీరోయిన్ రేంజ్ ను టచ్ చేసేది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే మృణాల్ ఠాకూర్…
హను రాఘవపూడి తీసిన ‘సీతారామం ‘ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నప్పటికి లిప్ లాక్ సీన్లలో నటించను అని చెప్పడంతో ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకోవాల్సి వచ్చింది. అయితే సినిమా ఇండస్ట్రీలో నిలకడగా ఉండాలి అంటే మాత్రం అన్నింటికి తెగించి ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంటుంది.
లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేరనేది వాస్తవం…ఇప్పటికి ఈ భామ రియలైజ్ అయినప్పటికి ఆమెకు జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. మరి ఇప్పుడు ఆమెకు వేరే హీరోల నుంచి ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయా లేదంటే ఇంకా ఆమె ఫేడౌట్ అయిపోవాల్సిందేనా అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సీతారామం సినిమాతో మాత్రం తన మాటలతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. మరి ఇలాంటి భామ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకోకపోవడం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుందనే చెప్పాలి. మరి ఈ ముద్దుగుమ్మ ముందు ముందు మరిన్ని అవకాశాలను దక్కించుకునే ఛాన్సులు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.