Game Changer Movie : నిన్న రాజమండ్రి లో జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్, ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఈవెంట్ లో మూవీ టీం మాట్లాడింది చాలా తక్కువే. కానీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సుమారుగా గంటకు పైగా ప్రసంగించాడు. ఆయన స్పీచ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మీడియా లో టీఆర్ఫీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో వస్తే, యూట్యూబ్ లో లైవ్ వ్యూయర్ షిప్ కౌంట్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. కేవలం ఒక్క ఛానల్ లోనే పవన్ కళ్యాణ్ ప్రసంగం సమయంలో 1 లక్ష 35 వేల మంది చూశారంటే, ఏ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అన్ని చానెల్స్ కి కలిపి దాదాపుగా 5 లక్షల 50 వేల లైవ్ వ్యూయర్స్ వచ్చారని, ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అత్యధిక లైవ్ వ్యూయర్స్ వచ్చిన టాప్ 5 లిస్ట్ తీస్తే గేమ్ చేంజర్ తర్వాత బ్రో ది అవతార్, భీమ్లా నాయక్, #RRR ,పుష్ప 2 చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ కి సంబంధించినవే ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు సింగిల్ ఛానల్ లో లక్షకు పైగా లైవ్ వ్యూయర్షిప్ వచ్చింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఏ హీరోకి కూడా ఒక్కసారి కూడా ఇలాంటి రికార్డు రాలేదు. కేవలం #RRR కి మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉంటే రికార్డు వచ్చేదేమో కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు.
అంతే కాదు యూట్యూబ్ లో నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్ కి కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ కి ఎక్కువ సమయం కేటాయించడం కోసం రామ్ చరణ్ కూడా తన ప్రసంగాన్ని కేవలం 5 నిమిషాల లోపే ముగించాల్సి వచ్చింది. రామ్ చరణ్ మాట్లాడుతున్న సమయం లో లైవ్ వ్యూయర్షిప్ కౌంట్ లక్ష 17 వేల వ్యూయర్స్ వచ్చారు. #RRR సమయం లో ఒక లక్ష 50 వేల వ్యూయర్షిప్ వచ్చింది. మళ్లీ ఈ రికార్డు ని ఎవరు బద్దలు కొట్టబోతున్నారో చూడాలి. ‘గేమ్ చేంజర్’ తర్వాత విడుదలయ్యే పెద్ద హీరో సినిమా ‘హరి హర వీరమల్లు’ నే కాబట్టి, ఈ సినిమాకి మాత్రమే ప్రస్తుతం ఈ రికార్డుని కొట్టే అవకాశం ఉంది.