Tollywood Movie : అందరి అభిరుచి ఒకేలా ఉండదు అనేది కాదనలేని వాస్తవం. కొంతమందికి ఇష్టమున్నది ఇతరులకు నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. సినిమాల విషయంలో కూడా అంతే జరుగుతుంది. కొన్ని సినిమాలు కొంత మందికి నచ్చితే.. మరికొంత మందికి అసలు నచ్చవు. కానీ కొందరికి మాత్రం ఆ సినిమాలపై పిచ్చి ఉంటుంది. ఇక టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో అట్టర్ ప్లాప్ అవచ్చు. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు బాలీవుడ్ లో సూపర్ ఫేమ్ అవచ్చు. బాలీవుడ్ లోనే కాదు ఇతర ఇండస్ట్రీలో కూడా ఫేమస్ అవుతుంటాయి. అసలు ఏంటీ ఈ గోల మాకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. అయితే మన టాలీవుడ్ లో ఫ్లాప్ గా మిగిలిన కొన్ని సినిమాలు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో వాటి వివరాలు ఇప్పుడు మీకోసం..
అయితే ఒక భాష నుంచి మరొక భాషలోకి సినిమాలను డబ్ చేస్తుంటారు. లేదా రీమేక్ చేస్తుంటారు. కానీ సినిమా హిట్ అయితేనే ఆ సాహసం చేయడానికి ఇష్టపడుతారు దర్శకనిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇక్కడ ఫ్లాప్ అయిన ఇతర ఇండస్ట్రీలో మంచి కలెక్షన్లను రాబట్టాయి. ప్రభాస్ నటించి సాహో సినిమా తెలుగులో ఏ విధమైన రిజల్ట్స్ ను రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో మాత్రం కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక కార్తికేయ 2 కూడా తెలుగులో మంచి విజయమే సాధించినా హిందీలో సూపర్ హిట్ ను అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే.. తెలుగు ఫ్లాప్ మూవీస్ హిందీ ఆడియన్స్ కు బ్రహ్మరథంగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో తెలుగు ఆడియన్స్ ఇష్టపడని సినిమాలు కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఈ జాబితాలో చాలా సినిమాలు ఉన్నాయి.
ఆగడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆగడు. ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ శంకర్ టైటిల్ తో హిందీలో ఒక ఊపు ఊపింది ఈ సినిమా. తెలుగులో పెద్దగా ఆడకపోయినా హిందీ ఆడియన్స్ ను మాత్రం ఫిదా చేసింది ఈ సినిమా. అయితే ఆగడు సినిమా ఎన్ కౌంటర్ శంకర్ పేరుతో హిందీలో డబ్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే.. టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది. ఇక యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగు ఆడియన్స్ ను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే.
లై..
నితిన్ హీరోగా వచ్చిన సినిమా `లై`. ఈ సినిమా కూడా తెలుగులో డిజాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది. కానీ హిందీలో మాత్రం నమ్మలేనంతగా ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. యూట్యూబ్ లో ఏకంగా 180 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సంపాదించుకుంది అంటే నమ్మశక్యం కాదు. కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్.
జై సింహా..
బాలయ్యకు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. అమెరికా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా ఆదరిస్తారు బాలయ్య సినిమాలను. అయితే నందమూరి నటసింహం నటించిన ఈ సినిమా తెలుగులో బిలో ఆవరేజ్ గా నిలిచింది. కానీ హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం సూపర్ సక్సెస్ గా నిలిచింది. దీన్ని బట్టి హిందీ ఆడియన్స్ తెలుగు ఫ్లాప్ సినిమాలను ఏ విధంగా ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కూడా యూట్యూబ్ లో ఇప్పటికే మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హల్ రీడర్స్.. మీరు బాలయ్య అభిమానులు అయితే ఓ లుక్ వేసేయండి..ఎందుకంటే ఈ సినిమా జోష్ తోనే అఖండ సినిమా కూడా హిందీలో డబ్ అయింది.
సీత..
మంచి కతతో వచ్చిన ఈ సినిమా ఎందుకో తెలుగు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా..తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా తెలుగులో డిజాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది. కానీ హిందీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు ఫిదా అయిపోయారంటే నమ్మండి. మరీ యూట్యూబ్ లో 500 మిలియన్ల కు పైగా వ్యూస్ ను సంపాదించడం అంటే మామూలు విషయమా.. సో ఈ సినిమా కూడా హిందీ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది అనే చెప్పాలి.
జయ జానకి నాయక..
ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ ఆడియన్స్ ను సూపర్ ఫిదా చేసిన సినిమాగా మందు వరుసలో నిలుస్తోంది ఈ సినిమా. తెలుగులో ఆవరేజ్ కానీ హిందీలో మాత్రం సూపర్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా కోసం అప్పట్లో ఫ్యాన్స్ తెగ వెతికేసారు. ఈ సినిమా పేరుతో బెల్లంకొండ ఇతర సినిమాలు ప్లే అయితే అభిమానులు హట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలా తెలుగులో డిజాస్టర్ గా నిలిచినా హిందీలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాయి కొన్ని సినిమాలు. దీంతో తెలుగు ఆడియన్స్, హిందీ ఆడియన్స్ అభిరుచులు కొన్ని విషయాలలో వేరుగా ఉంటాయి అనడంలో ఇదే నిదర్శనం.