Pawan kalyan: సినిమాలు, రాజకీయాలలో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా సినిమాలకు సంబధించి ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఆ నిర్ణయం ఇప్పుడు ఆయనతో సినిమాలు చేస్తున్న వారికీ పెద్ద కండీషన్ అయింది. ఇటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. అటు రాజకీయాలలోనూ బిజీ కావాలని పవన్ కల్యాణ్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఏమిటి ఆ నిర్ణయం అంటే.. ఇక పై పవన్ కళ్యాణ్ చేసే సినిమాలకు 60 రోజులు మాత్రమే కేటాయిస్తాడట.
అంటే.. ఇక నుంచి పవన్ చేసే ఒక్కో సినిమాకు 60 రోజుల కాల్షీట్ మాత్రమే ఇస్తాడు అన్నమాట. కాబట్టి, ఆయనతో సినిమాలు ప్లాన్ చేసే వారంతా ఆ లోపే షూటింగ్ పూర్తి చేసేయాలి. కచ్చితంగా అలా చెయ్యాలని పవన్ కళ్యాణ్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్ చిత్రాలు లైన్లో ఉన్నాయి.
Also Read: ఆ వ్యూహాలను అమలు చేసే దిశగా కేసీఆర్ కసరత్తులు.. ఇప్పట్లో పూర్తి అయ్యేనా..?
ఏది ఏమైనా సినిమాల కంటే కూడా రాజకీయాలలో బిజీ కావాలని పవన్ కల్యాణ్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023లో ఎన్నికల ఘంటారావం మోగనుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఇక నుంచి సినిమాల వేగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. ఇన్నాళ్లు సినిమా – రాజకీయం అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్.. ఇక నుంచి రాజకీయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించబోతున్నాడు.
Also Read: జలుబు, దగ్గు.. కొవిడా.. సాధారణ జ్వరమా.. నిపుణులు ఏమంటున్నారంటే?