Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రష్మిక మందార గీతాగోవిందం సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకునేసింది ఈ హీరోయిన్.
సినిమాల కన్నా కూడా ఏదో ఒక రూమర్ ద్వారా సోషల్ మీడియాలో నిలుస్తూ వస్తూ ఉంటుంది రష్మిక. ముఖ్యంగా విజయ దేవరకొండ తో తాను ప్రేమలో ఉంది అనే వార్త ఎన్నో రోజుల నుంచి హల్ చల్ చేస్తోంది. అంతేకాదు కొద్ది రోజుల క్రితం అయితే విజయ దేవరకొండ తో ఈ హీరోయిన్ కి బ్రేకప్ అయ్యింది అని ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో తాను రిలేషన్షిప్ లో ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో తన ప్రేమ, పెళ్లి గురించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన స్పందించని రష్మిక, తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈ విషయాల గురించి హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికను మీరు ఎవరితో అన్న ప్రేమలో ఉన్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని యాంకర్ అడగగా, ఆ ప్రశ్నకు రష్మిక దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. “ఇప్పటికే నాకు పెళ్లి అయ్యింది. ప్రస్తుతం నా మనసులో అతనే ఉన్నాడు అని చెప్పింది. అతనెవరో కాదు ‘నరుటో’ అని ఫన్నీగా సమాధానం చెప్పింది”. రష్మిక ఇలా చెప్పడంతో ఇంతకీ ఈ నరుటో ఎవరు? అని ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోయారు.
అది ఏమిటి అని యాంకర్ మరోసారి రష్మికనీ అడగగా “ఇది జపాన్ ఫేమస్ సిరీస్ ఇందులో ప్రధాన పాత్ర పేరు ‘నరుటో’. ఈ క్యారెక్టర్‌కి నేను పెద్ద ఫ్యాన్ నాలాగే ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. అందులో నేను ఒకరు” అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక మందాన ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప-2 లో నటిస్తుంది. అలానే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ సినిమా ‘యానిమల్’ లో కూడా హీరోయిన్ గా కనిపించానుండి రష్మిక.