Pawan Kalyan: చాలామంది దర్శకులు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పని చేయాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పనిచేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తిని చూపిస్తూ పోటీ పడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో నటించడానికి కొంతమంది దర్శకులు అవకాశం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. వాళ్లకి అవకాశాలు రాక పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథలను వేరే హీరోలతో చేసి మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఒక డైరెక్టర్ కథ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. అదేంటంటే ఆ డైరెక్టర్ ని స్వయంగా పవన్ కళ్యాణ్ పిలిచి మరి మనం ఒక సినిమా చేద్దాం అని చెబితే ఆ డైరెక్టర్ నావల్ల కాదు అంటూ చెప్పేశాడు. ఇక ఆ దర్శకుడు ఎవరు అని అంటే ఆయనే రచ్చ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంపత్ నంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం మొదట దర్శకుడిగా ఈయన్ని తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. ఇక అందులో భాగంగానే సంపత్ నందిని పిలిచి పవన్ కళ్యాణ్ రాసిన కథకి కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పడంతో అతను చేసిన మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు.
దాంతో మరొక వర్షన్ రాయమని చెప్పడంతో సంపత్ నంది అప్పటికే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి సార్ మీతో సినిమా చేయడం నావల్ల కాదు అని పవన్ కళ్యాణ్ తో చెప్పాడట. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ కథని తను రాయలేడని చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ దాన్ని క్యాష్ చేసి పట్టుకొని సినిమా చేసి హిట్టు కొట్టాలంటే చాలా ఘట్స్ కావాలనే ఉద్దేశ్యంలో సంపత్ నంది ఆలోచించి పవన్ కళ్యాణ్ తో సున్నితంగా చెప్పేసి ఈ సినిమా నుంచి పక్కకి తప్పుకొని రవితేజతో బెంగాల్ టైగర్ అనే సినిమా చేసి సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఇప్పటికి కూడా సంపత్ నంది ఒక సెకండ్ గ్రేడ్ డైరెక్టర్ గానే మిగిలిపోయాడు. ఈ సినిమా కనక చేసి ఉంటే ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకునేవాడు. ఇక పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన బాబీ ఆ తర్వాత జై లవకుశ, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు…సంపత్ నంది కి పవన్ కళ్యాణ్ తో చేసే అదృష్టం వరించిన కూడా ఆయన దానిని దక్కించుకోలేకపోయాడు…