Eagle: రవితేజ ఈగల్ మూవీ కి హరీష్ శంకర్ తీసిన షాక్ మూవీ కి మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ సంక్రాంతికి చాలా సినిమాలు రావడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసుకున్నారు.

Written By: Gopi, Updated On : January 5, 2024 6:34 pm

Eagle

Follow us on

Eagle: సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానం లో ఉంటే, ఆయన తర్వాత స్థానం లో రవితేజ ఉంటారు. ఈయన కూడా ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా వచ్చి ఇప్పుడు టాప్ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఈయన ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ సంక్రాంతికి చాలా సినిమాలు రావడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా విషయంలో రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ తో తనకు ఇండస్ట్రీలో మార్కెట్ భారీగా పెరుగుతుందనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఒకప్పుడు రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన షాక్ సినిమా కి ఇప్పుడు వస్తున్న ఈగల్ సినిమాకి మధ్య సంబంధం ఉందని చాలామంది చెప్తున్నారు.

ఇక అది ఏంటి అంటే షాక్ సినిమాలో ఎలాగైతే రవితేజ భార్య అయిన జ్యోతిక చనిపోతుందో ఈ సినిమాలో కూడా రవితేజ భార్య చనిపోతుందని తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రెండు సినిమాలు కూడా రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ ఉంటాయనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మరి కొంతమంది అయితే షాక్ సినిమానే ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ దాన్ని భారీ లెవెల్లో తెరకెక్కించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనే దానిమీద క్లారిటీ అయితే లేదు కానీ ఈగల్ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.

ఈ సినిమా విజువల్స్ కానీ, రవితేజ యాక్టింగ్ కానీ, దర్శకుడి మేకింగ్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో రవితేజ మరొకసారి సక్సెస్ కొడతాడా లేదా అనేది చూడాలి…ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడం రవితేజ కంటే కూడా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి చాలా కీలకం. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సూర్య వర్సెస్ సూర్య మూవీ ప్లాప్ అయింది. ఇక తను డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో ఉండాలి అంటే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి…