Jailer 2 Teaser: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోస్తున్న ‘జైలర్ 2’ అప్డేట్ వచ్చేసింది. నేడు సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ‘సన్ పిక్చర్స్’ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇంతకీ సన్ పిక్చర్స్ ఇవ్వబోతున్న అప్డేట్ ఏంటి?, గ్లింప్స్ వీడియో విడుదల చేయబోతున్నారా?, లేదా టీజర్ వదులుతున్నారా?, ఇవి రెండు కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల తేదీతో వదలబోతున్నారా?, అసలు ఏమి చేయబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది అభిమానుల్లో. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే , షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అని , ఈ సందర్భంగా విడుదల తేదీని ప్రకటించబోతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ‘జైలర్ 2’ అప్డేట్ రావడం అభిమానులకు ఒక పండగే.
రజినీకాంత్ కెరీర్ కి అత్యంత కీలక సమయం లో ఈ ‘జైలర్’ చిత్రం విడుదలైంది. అప్పటికే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ తో ‘బీస్ట్’ అనే ఫ్లాప్ చిత్రం చేయడం వల్ల , ఈ సినిమాపై అనుకున్నంత స్థాయి అంచనాలు అయితే లేవు. అలా మోడరేట్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ నే కురిపించింది. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉండడం సహజం. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఎలాంటి కంటెంట్ విడుదల చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉండేది.
నేడు సన్ పిక్చర్స్ అప్డేట్ తో వాళ్ళ ప్రాణాలు లేచివచ్చినట్టు అయ్యింది. ఇకపోతే మొదటి భాగం లాగానే , సీక్వెల్ లో కూడా శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు గెస్టులుగా కనిపించబోతున్నారు. వీళ్ళతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర నిడివి 20 నిమిషాలు వరకు ఉంటుందట. రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. రెండు రోజుల క్రితమే హృతిక్ రోషన్ , రజినీకాంత్ కాంబినేషన్ లో ఒక సన్నివేశాన్ని కూడా పూర్తి చేశారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందట. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
The Tiger is back on the hunt! Today 6 PM @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial #Jailer2 pic.twitter.com/KQB60JwSEY
— Sun Pictures (@sunpictures) July 2, 2026

