Venkatesh Pawan Kalyan : కొంతమంది హీరోలకు కొన్ని పాత్రలు వాళ్ళ కోసమే పుట్టాయా అన్నట్టుగా అనిపిస్తాయి, ఆ పాత్రలు కేవలం వాళ్ళు తప్ప ఎవ్వరూ చెయ్యలేరు అనేంతలా ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ చేస్తుంటారు ఆయా హీరోలు. అలాంటి హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. ఒకప్పుడు ఆయన హీరో గా నటించిన తొలిప్రేమ మరియు తమ్ముడు వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి.
ఈ రెండు సినిమాల్లో కంటెంట్ ని పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేస్తాడు. ఆ రేంజ్ లో నటించాడు, ఈ తరహా పాత్రలు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చెయ్యగలడు అనేంతలా జీవించాడు. అలా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా పేరు ‘వాసు’. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ లాంటి సినిమాని తీసిన కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు.
కథ పరంగా , పాటలు పరంగా మరియు ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ చిత్రాన్ని మనం ఇప్పటికీ కూడా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ముఖ్యంగా పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్ , ఇంత మంచి సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు అంటే ఎవరైనా నమ్మగలరా, కానీ అదే నిజం. అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా సక్సెస్ కాలేదు.
అందుకు కారణం గతం లో పవన్ కళ్యాణ్ ఇదే తరహా సినిమాల్లో ఇదే రకమైన పాత్రలు పోషించి, జనాల్లో నాటుకుపోయాడు. ఈ సినిమాని చూస్తున్నంతసేపు వెంకటేష్ ని ఎవ్వరూ చూడలేదు, ఆయన స్థానం లో పవన్ కళ్యాణ్ ని ఊహించారు. అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ కాలేదని అంటుంటారు విశ్లేషకులు. తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కరుణాకరన్ కి ఈ చిత్రం రూపం లో ఫ్లాప్ ఎదురైంది.