దాంతో సామ్ గతంలోకి వెళ్ళిపోయి అప్పటి పరిస్థితులను భయాలను నెమరువేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చింది. ‘నా కెరీర్ ప్రారంభంలో నాకు చాలా భయాలు సందేహాలుండేవి. పైగా నేను బలమైన ఎన్నో ఆటుపోట్లు తిన్నాను. మరెన్నో ఇబ్బందులు.. సవాళ్లను ఎదుర్కొన్నాను. అయితే నేను ఆ సవాళ్లనుండే పాఠాలు నేర్చుకున్నాను . జీవితంలో చిన్న వయసులోనే కఠినమైన సవాళ్లు రావడం ఎదగడానికి గొప్ప అవకాశం.
మొదట్లో నేను కూడా నా పరిస్థితి చూసి కలత చెందాను. కానీ ఆ తరువాత ఆ సవాళ్లను స్వీకరించాను. కసితో పని చేసుకుంటూ పోయాను. మనం పని చేసుకుంటూ పోయే క్రమంలో మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా మనకు అండగా నిల బడతారు. నాకు కూడా కొంతమంది సపోర్ట్ చేశారు. దాంతో నేను అన్నింటినీ అధిగమించగలిగాను. ఇక ఈ రోజు నేను ఎలా ఉన్నానో మీరందరికీ తెలుసు.
గతంలో ఎన్నడూ లేనంతగా నేను ఇప్పుడు చాల కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇంకా పెద్ద సవాళ్లను స్వీకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా అనుభవం ద్వారా నేను తెలుసుకుంది ఒక్కటే, సవాళ్లను ఎదర్కొనే ఏకైక మార్గం ఏమిటంటే.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే’ అంటూ సమంత తన సక్సెస్ సీక్రెట్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఇప్పటికి దక్షిణాది స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.