https://oktelugu.com/

ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ షాక్.. ఏం జరిగిందంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు షాకిచ్చేలా ఒక నిర్ణయం తీసుకుంది. జూలై నెల నుంచి డీఏ పెంపు అమలు ఉంటుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపును మోదీ సర్కార్ వాయిదా వేసిందని పలు నివేదికలు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నుంచి ఉద్యోగులకు డీఏ పెంపు ఉండనుందని తెలుస్తోంది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏలను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 1, 2021 / 03:38 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు షాకిచ్చేలా ఒక నిర్ణయం తీసుకుంది. జూలై నెల నుంచి డీఏ పెంపు అమలు ఉంటుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపును మోదీ సర్కార్ వాయిదా వేసిందని పలు నివేదికలు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నుంచి ఉద్యోగులకు డీఏ పెంపు ఉండనుందని తెలుస్తోంది.

    మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏలను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అయితే కేంద్రం డీఏ చెల్లింపులను ఆలస్యం చేస్తున్నప్పటికీ డీఏ పెంపుతో పాటు ఎరియర్స్ ను ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి ఇలా మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డియర్‌నెస్ అలవెన్స్ ను కేంద్రం ఉద్యోగులకు అందించాల్సి ఉంది.

    కరోనా వైరస్ వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావం ఉద్యోగులపై పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాగా గత నెల 26, 27 తేదీలలో డీఏ చెల్లింపు అంశానికి సంబంధించి ఒక సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వపు కేబినెట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, సెంట్రల్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    దాదాపు 28 అంశాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రం డీఏల చెల్లింపులను వాయిదా వేస్తుండటంతో ఉద్యోగులకు నిరాశే ఎదురవుతూ ఉండటం గమనార్హం.