కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగే విధంగా ప్రకటన చేసింది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ విషయంలో మోదీ సర్కార్ వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి.
వెలువడిన నివేదికల ప్రకారం జులై నెల 1వ తేదీ నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే మోదీ సర్కార్ మాత్రం వడ్డీరేట్లను స్థిరంగా కొనసాగించడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వడ్డీరేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువడింది.
ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ పై మాత్రం వడ్డీరేటు 6.8 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌పై 7.4 శాతం, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై వడ్డీ రేటు 6.6 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకంపై 7.6 శాతం వడ్డీరేటు లభిస్తుండటం గమనార్హం. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ పై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది.
కేంద్రం మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వడ్డీరేట్ల విషయంలో నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలలో చాలామందికి ఊరట కలగనుంది.