Ram Charan
Ram Charan: చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమా తోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దాంతో రెండో సినిమాగా రాజమౌళి దర్శకత్వం లో మగధీర అనే సినిమా చేశాడు. ఈ మూవీతో ఆయన్ రేంజ్ ను స్టార్ హీరో స్థాయి కి వెళ్ళిపోయిందనే చెప్పాలి.
ఇక దీంతో రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అతనికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలనే కోరిక అయితే ఉండేది. దాంతో ఒకప్పుడు అమితాబచ్చన్ హీరోగా వచ్చిన జంజీర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక అదే సినిమాని రీమేక్ చేసే సక్సెస్ సాధించాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమాతో భారీ డిజాస్టర్ రావడంతో రామ్ చరణ్ కి బాలీవుడ్ లో బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. ఇక దాంతో అక్కడున్న ప్రొడ్యూసర్లు చాలామంది రామ్ చరణ్ ను విమర్శించారు.
ఇక తుఫాన్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక దానికి ప్రొడ్యూసర్ గా కరణ్ జోహార్ ని ఉండమని చెబితే రామ్ చరణ్ హీరో అయితే ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ గా ఉండలేను అని చెప్పి తను తప్పుకున్నాడు. ఇక ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్న రామ్ చరణ్ వాళ్ళకి సమాధానం చెప్పాలని ఉద్దేశ్యంతో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.
ఇక దాంతో ఒకప్పుడు రామ్ చరణ్ తో సినిమా అంటే తప్పుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఆయన డేట్స్ కోసం ఆయన చుట్టు తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే అవమానాన్ని ఎదుర్కొన్నాడో అక్కడే సక్సెస్ కొట్టి ఇప్పుడు స్టాండర్డ్ గా నిలబడిన రామ్ చరణ్ ని చూసి తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మనం చేసే పనిలో స్పష్టత ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఇవాళ్ల కాకపోతే రేపైన వస్తుంది కానీ మనం మన పట్టుదలను మాత్రం వదిలేయకూడదనే ఉద్దేశంలో ఒక గొప్ప నీతి చెప్పాడంటూ ప్రతి ఒక్కరు రామ్ చరణ్ ను పొగుడుతున్నారు…