Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దుసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లో మహేష్ బాబు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించాయి అనే చెప్పాలి.
మొదట్లో ఇతను హీరోగా పనికిరాడు అని చాలామంది మహేష్ బాబును విమర్శించినప్పటికీ ఆయన ఎక్కడ కూడా నిరాశ పడకుండా సినిమా సినిమాకి తన నటనలోని వైవిధ్యాన్ని చూపిస్తూ పరిణితి చెందిన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన దాదాపు 10 గంటల పాటు జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు బాడి ని మనం ఇంతకుముందు వేరే ఏ సినిమాల్లో చూడనట్టుగా తయారు చేయడానికి రాజమౌళి అండ్ టీం రెడీ అయినట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే చాక్లెట్ భాయ్, మిల్క్ బాయ్ లా కనిపించే మహేష్ బాబు ఈ సినిమాలో ఒక మంచి బాడీ బిల్డర్ గా కూడా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. రాజమౌళి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు అనడానికి ఇదోక ఉదాహరణగా చెప్పవచ్చు. మహేష్ బాబు ఇంతకుముందు కొన్ని సినిమాల్లో సిక్స్ ప్యాక్ ట్రై చేసినప్పటికీ అది రాలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం రాజమౌళి మహేష్ బాబు తో సిక్స్ ప్యాక్ చేసి చూపిస్తాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఈ సినిమా మీద భారీ అంచనాలను కలిగిస్తుంది. ఇక షూట్ జరిగి సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ వచ్చాయంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లోనే ఒక భారీ హిట్టు కొట్టబోతున్నాడు అనేది క్లారిటీగా తెలుస్తుంది. మరి రాజమౌళి కూడా ఈ సినిమాతో ఇంతకు ముందు తెలుగు సినిమాలో ఏ దర్శకుడి కి దక్కని ఘనతని సాధించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…