Andhra Politics : ఆంధ్రాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా పదవి చేపట్టబోతున్నారు. మరి వైఎస్ఆర్ కుటుంబంలో ఇదో పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట అధికార పార్టీగా ఉంటే.. చెల్లి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయబోతున్నారు. వీరిద్దరి వైరం ఆసక్తి రేపుతుంది.
ఆంధ్రాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎటువైపు మొగ్గు చూపుతారు. షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పాస్టర్ గా ఉండడంతో ఆయన వైపు క్రిస్టియన్లు వైపు మొగ్గుచూపుతారా? లేదా మునుపటిలా జగన్ వెంటనే క్రైస్తవులు నడుస్తారా? అన్నది చర్చనీయాంశమవుతోంది.
అన్నకు చేరే క్రైస్తవ మైనార్టీ ఓటు బ్యాంకును షర్మిల కనుక చీలిస్తే.. అది ఖచ్చితంగా జగన్ కు మైనస్ అవుతుంది. ఆయన సీట్లు, ఓట్లు తగ్గిపోతాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రా రాజకీయాల్లో మత ప్రభావమెంత? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.