Tharun Bhascker: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, చిన్న చిన్న క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొస్తున్న ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), పెళ్లి చూపులు సినిమాతో హీరో గా మారాడు. తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గా ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యంగ్ హీరోలలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నాని లను హీరోలను చేసింది సురేష్ బాబునే. ఇద్దరికీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్స్ ని అందించాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ పెళ్లి చూపులు కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: ‘L2 ఎంపురాన్’ ని దాటేసిన ‘తుడరం’..10 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!
రీసెంట్ గానే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ ని కలిసి ఒక ఆసక్తికరమైన స్టోరీ లైన్ ని వినిపించాడట. ఈ సినిమాకు టైటిల్ ‘బినామీ’ అట. విజయ్ దేవరకొండ కి కథ తెగ నచ్చేసింది. గతం లో విజయ్ తో ‘గీత గోవిందం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. హీరోయిన్ ఎవరు?, ఎవరెవరు ఈ చిత్రం లో నటించబోతున్నారు వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, త్వరలోనే ఈ కాంబినేషన్ మాత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుంది అనేది ఖరారైంది. తరుణ్ భాస్కర్ సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ‘పెళ్లి చూపులు’ తర్వాత ఆయన తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం కమర్షియల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, యూత్ ఆడియన్స్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.
అదే విధంగా తరుణ్ భాస్కర్ రీసెంట్ చిత్రం ‘కీడా కోలా’ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. అలా ఆడియన్స్ లో మినిమం గ్యారంటీ అనే ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజ్ ఉన్న హీరో తో సినిమా చేస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మే 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి, మొన్న విడుదల చేసిన మొదటి పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కున్న ‘రౌడీ జనార్దన్’ అనే చిత్రంలో కూడా నటించబోతున్నాడు. ఈ చిత్రం తర్వాతనే తరుణ్ భాస్కర్ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.