Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు తమ అభిమాన హీరోని వెండితెర పై చూసేందుకు దాదాపుగా మూడేళ్ళ నుండి నిరీక్షిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. గడిచిన ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ సినిమాలపై గత ప్రభుత్వం అతి తక్కువ టికెట్ రేట్స్ పెట్టడం వల్ల కోట్ల రూపాయిల నష్టాలను పవన్ సినిమాలు చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ చిత్రం అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ గా నిల్చింది కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ ది కాబట్టి టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్, ఇలా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఆయన సినిమా ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’..ఎందులో చూడాలంటే!
వాళ్ళ ఎదురు చూపులకు ఇక తెరపడినట్టే అనుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి డేట్స్ సరిగా కేటాయించలేకపోయిన పవన్ కళ్యాణ్, ఎట్టకేలకు నిన్నటి నుండి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. నిన్న సాయంత్రం మొదలైన షూటింగ్, నేడు కూడా కొనసాగుతుంది. ఈ షూటింగ్ కి పవన్ కళ్యాణ్ తో పాటు, ఆయన సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నాడు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. రేపటి తో పవన్ కళ్యాణ్ భాగానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతుందట. ఇక మిగిలిన షూటింగ్ మే8 లోపు పూర్తి అవుతుందని, విడుదల తేదీని మే9 న అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే నేడు రాత్రికి షూటింగ్ కార్యక్రమం పూర్తి అయినా తర్వాత బయ్యర్స్ తో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ సమావేశం లో నిర్మాత AM రత్నం, పలు ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన బయ్యర్స్, టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరు అవుతారట. నేడు విడుదల తేదీని ఖరారు చేసి, బయ్యర్స్ కి ఒక సమాచారం అందిస్తారట. ఈ సినిమా నైజాం ప్రాంతం హక్కులను ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ కొనుగోలు చేసింది. వాళ్ళ ఇస్తున్న సలహా ఏమిటంటే ఈ చిత్రాన్ని ఈ నెల 30 వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందని. కేవలం మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే కాదు, రాష్ట్రం లో ఉన్న బయ్యర్స్ అందరూ మే30 న విడుదల చేయమని అడుగుతున్నారట. కానీ AM రత్నం కి మాత్రం జూన్ 13న విడుదల చేయాలని ఉంది. ఎందుకంటే ప్రొమోషన్స్ కోసం ఆయన నెల రోజుల సమయాన్ని కోరుకుంటున్నాడు. ఈ రెండు తేదీలలో ఎదో ఒకటి ఖరారు నేడు రాత్రే చేయనున్నారు.