దుబ్బాకలో టీఆర్ఎస్ ‘సేఫ్’ గేమ్

కరోనా ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కరోనాకు ముందు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటైనా పార్టీ లేదని.. కేసీఆర్ తో తలపడే నాయకుడే లేడనే టాక్ రాష్ట్రమంతటా విన్పించింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. తొలినాళ్లలో కరోనా కట్టడిని కేసీఆర్ బాగానే కట్టడి చేసినట్లు కన్పించినా ఆ తర్వాత ఆయనే కొద్దిరోజులపాటు కన్పించకుండా పోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సర్కార్ కరోనా విషయంలో చేతులెత్తేసిందనే ఆరోపణలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కరోనా […]

Written By: Neelambaram, Updated On : August 29, 2020 12:51 pm
Follow us on


కరోనా ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కరోనాకు ముందు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటైనా పార్టీ లేదని.. కేసీఆర్ తో తలపడే నాయకుడే లేడనే టాక్ రాష్ట్రమంతటా విన్పించింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. తొలినాళ్లలో కరోనా కట్టడిని కేసీఆర్ బాగానే కట్టడి చేసినట్లు కన్పించినా ఆ తర్వాత ఆయనే కొద్దిరోజులపాటు కన్పించకుండా పోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సర్కార్ కరోనా విషయంలో చేతులెత్తేసిందనే ఆరోపణలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కరోనా టైంలోనే సచివాలయం కూల్చివేత వంటి పనులు చేపట్టి ప్రభుత్వం విమర్శలు మూటకట్టుకుంది.

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలైందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. క్రమంగా టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి ఆ సీటును దక్కించుకోవడం కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆ ప్రభావం దుబ్బాక ఉప ఎన్నికపై పడే ప్రభావం కన్పిస్తోంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గులాబీ జెండానే ఎగిరింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొదలైన వ్యతిరేక ప్రభావం దుబ్బాకపై పడకుండా చూడగలిగితే దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు సులభమేనని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎలాంటి రిస్కు తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతుంది.

దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకే అప్పగించేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హరీష్ రావు ధీటుగా ఎదుర్కొని విజయం సాధించి పెడుతారని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో అతడికే ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించనున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.

Also Read: కరోనా దెబ్బకు అప్పులపాలు అయిపోతారు : వైద్య శాఖ మంత్రి ఈటెల

ప్రస్తుత పరిస్థితుల్లో దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి ఫ్యామిలీకే ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. 2004, 2008, 2014, 2018లో రామలింగారెడ్డి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచిపట్టు ఉంది. దీంతో రామలింగారెడ్డి ఫ్యామిలీలో టికెట్ ఇస్తేనే సెంటిమెంట్ కలిసి వస్తుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే రామలింగారెడ్డి భార్య సుజాత లేదా ఆయన కుమారుడు సతీశ్‌రెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులకు టికెట్ ఇస్తే జనాల్లో వ్యతిరేకత వచ్చి ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తుంది. దీంతో ఆ కుటుంబంలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే కేసీఆర్ పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించి.. ప్రచారానికి పంపుతారా? లేదా నోటిఫికేషన్ వచ్చాక ఆయనే నేరుగా రంగంలోకి దిగుతారా? అనేది వేచి చూడాల్సిందే..!