Heroine : ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్, ఓవర్ నైట్ స్టార్డం.. బ్యాగ్రౌండ్ చూస్తే ఇంట్లో నుండి పారిపోయిన బాపతు, ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా?

అలాంటి వారిలో మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ ఒకరు. సినిమాల్లో నటించాలనే ఇష్టంతో ఇంటి నుంచి పారిపోయింది. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. తొలి సినిమాలో నటనకు అబ్బాయిల డ్రీం గర్ల్ గా మారిపోయింది. సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

Written By: S Reddy, Updated On : July 11, 2024 8:19 pm

Shalini Pande

Follow us on

Heroine : సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. ఎన్నో కలలతో పరిశ్రమలో అడుగు పెడతారు. కానీ స్టార్ హీరోయిన్ అవ్వడం అందరికీ సాధ్యం కాదు. పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. అందం, అభినయం ఉన్నా ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. కొందరు భామలు ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు.కానీ ఆ స్టార్డం ఎక్కువ కాలం నిలిపుకోలేరు. మెల్ల మెల్లగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతుంటారు.

అలాంటి వారిలో మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ ఒకరు. సినిమాల్లో నటించాలనే ఇష్టంతో ఇంటి నుంచి పారిపోయింది. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. తొలి సినిమాలో నటనకు అబ్బాయిల డ్రీం గర్ల్ గా మారిపోయింది. సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆమెకు ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.

ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ‘ అర్జున్ రెడ్డి ‘ హీరోయిన్ షాలిని పాండే. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. అదే సమయంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాత కూడా ఆయనే. కథ రీత్యా మూవీలో లిప్ లాక్ సన్నివేశాలు లెక్కకు మించి ఉన్నాయి. ఇక హీరో క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేశాడు. కోపమైనా ప్రేమనా ఎక్కువే అన్నట్లు హీరో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుంది.

ఈ మూవీలో ప్రేయసి అయిన షాలిని పాండే మీద విజయ్ దేవరకొండ చేయి చేసుకుంటాడు. లిప్ లాక్ సన్నివేశాలతో పాటు, హీరోయిన్ ని కొట్టడం పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాదర్ *** అని హీరో డైలాగ్ చెప్పడం కూడా వివాదాస్పదం అయ్యింది. అనసూయ సైతం అప్పట్లో అర్జున్ రెడ్డి మూవీ మీద ధ్వజం ఎత్తింది. ఈ సినిమాలో షాలిని కి జంటగా నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. కానీ షాలిని కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. అర్జున్ రెడ్డి ద్వారా వచ్చిన క్రేజ్ సరిగా ఉపయోగించుకోలేక పోయింది. మహానటి మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర చేసింది. అది షాలిని చేసిన పెద్ద పొరపాటు. ఆమె సపోర్టింగ్ రోల్ చేయకుండా ఉండాల్సింది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఆఫర్లు లేవు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది.

కాగా షాలిని నేపథ్యం, ఆమె చిత్ర పరిశ్రమకు వచ్చేందుకు చేసిన రిస్క్ చూస్తే ఒకింత సినిమాటిక్ గా ఉంటుంది. షాలిని తండ్రి ఆమెను ఇంజనీర్ చేయాలని అనుకున్నారట. సినిమాల్లో నటించడానికి అసలు ఒప్పుకోలేదట. షాలిని తండ్రికి ఎంత నచ్చజెప్పినా అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ముంబై వచ్చేసిందట. ముంబైలో తన స్నేహితులైన కొందరు అబ్బాయిల గదిలో రెంట్ కి ఉండాల్సి వచ్చిందట. ఆ అబ్బాయిలే తన కుటుంబంగా మారి సినిమాల్లో నటించేందుకు హెల్ప్ చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. షాలిని పాండే ఇటీవల ‘ మహరాజ్ ‘ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించాడు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ విడుదలను అడ్డుకోవాలని చూశారు. కోర్టులు కేసులు వేయడమైంది. అవరోధాలు దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.