Thangalaan – Trailer (Telugu) : తంగలాన్ సినిమా ట్రైలర్ అంత ఎఫెక్టివ్ గా లేదు.. మరి సినిమా పరిస్థితి ఏంటి..?

Thangalaan - Trailer (Telugu) ఇక పా రంజిత్ గత సినిమాలు కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇక రజనీకాంత్ తో చేసిన కబాలి, కాలా లాంటి రెండు సినిమాలు కూడా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు. ఆయనకు తెలుగులో అయితే అంత పెద్ద ట్రాక్ రికార్డు అయితే లేదు.

Written By: NARESH, Updated On : July 10, 2024 8:12 pm

Thangalaan - Trailer (Telugu)

Follow us on

Thangalaan – Trailer (Telugu) : విక్రమ్ హీరోగా పా. రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న ‘తంగలాన్ ‘ సినిమా మీద ప్రేక్షకులందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్టుగా కూడా కొన్ని మేకింగ్ వీడియోలను చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నప్పటికీ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద మొన్నటిదాకా కన్ఫ్యూజన్స్ ఉండేవి కానీ రీసెంట్ గా ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ ఇందులో విక్రమ్ అడవుల్లో నివసించే ఒక తెగకు సంబంధించిన వ్యక్తి క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ట్రైలర్ ను చూస్తే విక్రమ్ నివసించే ప్రాంతం లో దొరికే బంగారం కోసం ఒక వ్యక్తి వీళ్ళకు డబ్బులు ఇచ్చి మరి ఆ బంగారాన్ని వెతికించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక సినిమాలోని మెయిన్ పాయింట్ ఇదే ఇక దీని చుట్టే డైరెక్టర్ డ్రామా ను బిల్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దాన్ని సాధించడం కోసమే వీళ్లంతా పనిచేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. విక్రమ్ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ డైరెక్టర్ పెట్టిన ఎఫర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపించడం లేదు. ఇక పా. రంజిత్ చాలా మంచి దర్శకుడు అయినప్పటికీ కొన్ని షాట్స్ ఒకే అనిపించాయి. అయినప్పటికి ఆ బంగారం దొరికిందని ఆ అధికారికి చూపించే షాట్ కానీ విక్రమ్ సఫర్ అయ్యే షాట్స్ కానీ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.

మరి డైరెక్టర్ ఈ సినిమాని ఎలా తీశాడు అనేది చూడాలి. ఇక పా రంజిత్ గత సినిమాలు కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇక రజనీకాంత్ తో చేసిన కబాలి, కాలా లాంటి రెండు సినిమాలు కూడా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు. ఆయనకు తెలుగులో అయితే అంత పెద్ద ట్రాక్ రికార్డు అయితే లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…