Prabhas : ప్రభాస్ నిజంగా భోళా శంకరుడే… వేల మందికి కోట్లు పంచిన డార్లింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ బయటపెట్టిన రహస్యం!

Prabhas నా కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి హీరోని చూడలేదు. కల్కి షూటింగ్ జరిగిన అన్ని రోజులు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చింది. ప్రతి ఒక్కరికి తన ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించి పెట్టేవాడు. నిజంగా డార్లింగ్ లాంటి హీరో మరొకరు ఉండరని ప్రశంసలు కురిపించాడు. కల్కి చిత్రానికి వేల మంది పని చేశారు. కాబట్టి ప్రభాస్ పంచిన డబ్బులు కోట్లలో ఉంటాయని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు రియల్ హీరో వి అంటూ ప్రభాస్ ని కొనియాడుతున్నారు.

Written By: S Reddy, Updated On : July 11, 2024 8:32 am

Prabhas

Follow us on

Prabhas : డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన వేల మందికి కోట్ల రూపాయలు పంచాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ చాలా ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన చేసినటువంటి సహాయాలు పెద్దగా బయటకు రాకపోవచ్చు. కానీ సినీ పరిశ్రమలో ప్రభాస్ గురించి ఎవరిని అడిగినా ఎంతో గొప్పగా చెబుతారు. తాజాగా ఆయన చేసిన కోట్ల రూపాయల సాయాన్ని కల్కి కాస్ట్యూమ్ డిజైనర్ బయటపెట్టారు. ప్రభాస్ లాంటి మంచి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రశంసలు కురిపించారు.

జూన్ 27న థియేటర్స్ లో విడుదల అయిన కల్కి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు చేరువలో ఉంది. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా ఇంకా వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు డార్లింగ్ చేసిన పని కల్కి గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది.

కల్కి 2898 ఏడీ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్స్ లో ఒకరైన మురళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ .. కల్కి సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ లో పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రభాస్ రూ. 10 వేల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. సినిమా కోసం పని చేసిన అందరి పేర్లు తెలుసుకుని .. వారి అకౌంట్స్ లో పదివేలు చొప్పున జమ చేశారు.

నా కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి హీరోని చూడలేదు. కల్కి షూటింగ్ జరిగిన అన్ని రోజులు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చింది. ప్రతి ఒక్కరికి తన ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించి పెట్టేవాడు. నిజంగా డార్లింగ్ లాంటి హీరో మరొకరు ఉండరని ప్రశంసలు కురిపించాడు. కల్కి చిత్రానికి వేల మంది పని చేశారు. కాబట్టి ప్రభాస్ పంచిన డబ్బులు కోట్లలో ఉంటాయని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు రియల్ హీరో వి అంటూ ప్రభాస్ ని కొనియాడుతున్నారు. సెట్ లో ఉన్నవారందరూ తాను తినే భోజమే తినేలా ప్రభాస్ ఏర్పాట్లు చేస్తాడని గతంలో కూడా కొందరు చెప్పారు. సంపాదించిన మొత్తం దాచుకోకుండా ప్రభాస్ ఇలా… పలువురికి సహాయం చేస్తున్నాడు.