Balayya-Jr NTR: బాలయ్య సినిమాను ఎన్టీయార్ చేస్తే.. ఎన్టీయార్ సినిమాను బాలయ్య చేశాడా..? ఇంతకీ ఆ సినిమాలు ఏంటి..?

Balayya-Jr NTR: సీనియర్ ఎన్టీయార్ నట వారసుడిగా ఇండస్ట్రి కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఒకానొక సమయంలో బాలయ్య బాబు చేయాల్సిన ఒక సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేశారట. ఇక దాంతో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాని బాలయ్య బాబు చేశాడు.

Written By: Gopi, Updated On : July 11, 2024 10:23 am

Jr NTR Balakrishna

Follow us on

Balayya-Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి సపరేట్ గుర్తింపు ఉందనే చెప్పాలి. ఇక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరూ ఇండస్ట్రీ లో రాణిస్తూనే వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి నాలుగో జనరేషన్ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీయార్ నట వారసుడిగా ఇండస్ట్రి కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఒకానొక సమయంలో బాలయ్య బాబు చేయాల్సిన ఒక సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేశారట. ఇక దాంతో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాని బాలయ్య బాబు చేశాడు. ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాలు ఏంటి అనే అనుమానులు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాను బాలయ్య బాబు చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల అది ఎన్టీయార్ చేశాడు. ఈ సినిమాని చేసి ఎన్టీయార్ సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా ఎదిగాడు… ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన స్వామి సినిమాను తెలుగులో ఎన్టీఆర్ రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ అంతకుముందే ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఈ సినిమా రైట్స్ ని తీసుకొని బాలయ్య బాబుతో ‘లక్ష్మి నరసింహ’ అనే సినిమా చేశాడు. ఇక మొత్తానికైతే అబ్బాయి చేయాల్సిన సినిమా బాబాయ్..బాబాయ్ చేయాల్సిన సినిమాను అబ్బాయి చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు.

ఇక ప్రస్తుతం ఇద్దరు కూడా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తనకంటూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా నేటితో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఎన్టీయార్ సింహాద్రి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి… దాంతో 20 ఏళ్లకే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు…