https://oktelugu.com/

Devara 2 : దేవర 2 విషయంలో అభిమానుల మాట వింటున్న ఎన్టీయార్…

ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 09:24 AM IST

    Devara 2

    Follow us on

    Devara 2 : ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకొని స్టార్ హీరోలకి సైతం సక్సెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… మరి వాళ్ళు అనుకున్నట్టుగానే స్టార్ హీరోలతో భారీ సక్సెస్ లను అందుకునే కెపాసిటీ ఈ యంగ్ డైరెక్టర్స్ కి ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

    సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి వరుసగా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను తన భుజ స్కందాల మీద మోస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి… అలాంటి హీరో కొరటాల శివ లాంటి దర్శకుడితో కలిసి చేసిన దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికి భారీ కలెక్షన్స్ ను తీసుకురావడం కొంతవరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి… మరి ఇలాంటి సందర్భంలో దేవర సినిమా చివర్లో దేవర 2 అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమాను చేసే ఇంట్రెస్ట్ ఎన్టీఆర్ కి ఉందా లేదా అనే రీతిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాడు. కానీ తను అనుకున్న రేంజ్ లో వసూలైతే రాలేదు. దాంతో తీవ్రమైన నిరాశకు గురైన ఎన్టీఆర్ దేవర 2 సినిమాని చేయడానికి ఇష్టపడటం లేదట… ఇక అలాగే కొరటాల శివ కూడా వేరే ప్రాజెక్టు మీద బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడితో కొంతమంది దర్శకులు భారీ సక్సెస్ లను అందుకొని స్టార్ డైరెక్టర్స్ గా వెలుగొందుతున్నారు.

    కానీ కొరటాల శివ మాత్రం అలాంటి సక్సెస్ ని సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలేవి కూడా పెద్దగా గుర్తింపును తీసుకురాకపోవడంతో ఆయన తన తదుపరి సినిమాల మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తాడు.

    కానీ ఇండస్ట్రీలో మార్కెట్ పరంగా కొంతవరకు వెనుకబడ్డాడు. మరి ఆ మార్కెట్ ని కూడా పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక తన అభిమానులు కూడా దేవర 2 చేయకపోతేనే బెటర్ అన్నట్టుగా కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం…

    ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడు. దేవర 2 సినిమా గురించి అసలు ఆయన ఏమనుకుంటున్నారనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…. ఇక ప్రస్తుతం కొరటాల ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…