Thandel US Premiere Review: సినిమా ఇండస్ట్రీ అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు, నాగార్జున తర్వాత నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో సరిగ్గా ఆడడం లేదు. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న నేపధ్యం లో యూఎస్ఏ లో ఇప్పటికే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి… ఇక యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే తండేల్ రాజు(నాగ చైతన్య), బుజ్జి (సాయి పల్లవి)ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇక రాజు చేపల వేట సాగిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇక ఎట్టకేలకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను ఇంట్లో వాళ్లతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు… ఇక ఇలాంటి సందర్భంలోనే అతను ఒక పెద్ద వేటకు వెళ్లాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక అదే చివరి వేట అని బుజ్జికి చెప్పి వేటకు వెళ్తాడు. ఆ సందర్భంలోనే ఆయన పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారట. ఇక యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా సినిమా అద్భుతంగా ఉంది. నాగచైతన్యకు మరొక మంచి సక్సెస్ అయితే దక్కుతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా సాయి పల్లవి, నాగచైతన్య ఇంతకుముందు చేసిన లవ్ స్టోరీ సినిమా యావరేజ్ గా ఆడింది. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్లడం పక్కా అంటూ యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన కొంతమంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇక ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయట. అలాగే వీళ్లిద్దరి లవ్ స్టోరీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది అంటూ సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య కెరీర్లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అంటూ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు తెలియజేస్తుండడం విశేషం… పాటలు అద్భుతంగా ఉండడంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలావరకు ప్లస్ అయిందనే చెబుతున్నారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాగచైతన్య తండేల్ రాజు క్యారెక్టర్ లో జీవించేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో పెద్దగా యాక్టింగ్ అయితే చేయలేదు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నాగచైతన్య ఈ సినిమాలో జీవించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా నాగ చైతన్య చాలా మంచి నటుడు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అవుతుందని చాలామంది చెబుతున్నారు… అలాగే సాయి పల్లవి కెరియర్ లో ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలుస్తుందని లవ్ స్టోరీ కి సంబంధించిన సీన్స్ లో గాని నాగచైతన్య పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయిన తర్వాత ఆమె పడే స్ట్రగుల్ గాని అతడిని విడిపించడానికి ఆమె చేసే పోరాటం గాని చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది… ఇక మిగతా ఆర్టిస్టులు సైతం వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉండడంతో సాంగ్స్ చాలా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. అలాగే భారీ ఎలివేషన్ సీన్స్ లో గాని ఎమోషన్ సీన్స్ లో గాని ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందట… ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందని కొన్ని సిచువేషన్స్ లో అయితే సినిమాటోగ్రాఫర్ కొన్ని షాట్స్ తో సినిమా మొత్తానికి ఒక బ్యూటీ తీసుకొచ్చాడని కూడా చాలామంది చెబుతూ ఉండడం విశేషం…