Thandel Glimpse: నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసిన మొదటి రోజు నుంచే ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండటమే కాకుండా నాగ చైతన్య కి ఈ సినిమాతో మరో మంచి హిట్ దక్కబోతుంది అంటూ ప్రచారం కూడా సాగింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తండేల్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది.
‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ అనే పేరు తో ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగచైతన్య క్యారెక్టర్ ని రీవిల్ చేసిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చేపలు పట్టడానికి వెళ్లిన నాగ చైతన్య బ్యాచ్ పాకిస్థాన్ పోలీస్ లకి దొరికిపోతారు. దాంతో అక్కడ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టిన దేశం గురించి గొప్ప గా చెప్పి ఇండియన్స్ దమ్ము ఏంటో చూపించే కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక అలాగే సినిమాలో దేశభక్తిని మిళితం చేస్తూ కొన్ని సీన్లు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులోనే ఒక అద్భుతమైన ప్రేమ కథని కూడా చూపించబోతున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ గ్లింప్స్ లో డైరెక్టర్ వాడిన షాట్స్ చాలా కొత్త గా ఉండటమే కాకుండా చాలా రిచ్ గా కూడా ఉన్నాయి. ఇక ఈ గ్లింప్స్ చివర్లో సాయి పల్లవి లుక్కు ను కూడా రిలీజ్ చేశారు. ఇక సాయి పల్లవి సముద్రం దగ్గర నవ్వుతూ ఉంటే బ్యాగ్రౌండ్ లో నాగచైతన్య వాయిస్ లో బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నాను, కాస్త నవ్వే అనే డైలాగులు ఆడ్ చేశారు. దాంతో ఈ గ్లింప్స్ అనేది చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక నాగచైతన్యకి ఈ సినిమాతో హిట్ దక్కుబోతుందంటూ చాలా మంది అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక చందు మొండేటి ఇంతకుముందు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఈ సినిమాతో కూడా పాన్ ఇండియా లెవల్లో తన సత్తాను చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…