Homeఎంటర్టైన్మెంట్Thalapathy Vijay Trisha Wedding Function Video: త్రిష తో కలిసి పెళ్లి ఫంక్షన్ కి...

Thalapathy Vijay Trisha Wedding Function Video: త్రిష తో కలిసి పెళ్లి ఫంక్షన్ కి వెళ్లిన తమిళ హీరో విజయ్.. సంచలనం రేపుతున్న వీడియో!

Thalapathy Vijay Trisha Wedding Function Video: గత వారం రోజుల నుండి సోషల్ మీడియా లో తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం పై ఏ రేంజ్ లో చర్చ నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన భార్య సంగీత విడాకుల పిటీషన్ లో విజయ్ పై చేసిన బలమైన ఆరోపణలు సంచలనంగా మారాయి. విజయ్ అభిమానులు కొంతమంది నమ్మి సంగీత కి న్యాయం జరగాలని కోరుకున్నారు, కొంతమంది అయితే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సంగీత చేసిన ప్రధానమైన ఆరోపణల్లో ఒకటి, విజయ్ ఎప్పటి నుండో ఒక ప్రముఖ హీరోయిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయం నాకు తెలిసేసరికి ఆయన మరోసారి ఆమెతో కలవనని మాట ఇచ్చాడు కానీ, 2021 నుండి మళ్లీ ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని, మానసికంగా ఎంతో టార్చర్ కి గురయ్యాను, విడాకులు కావాలంటూ ఆమె పిటీషన్ లో పేర్కొంది.

అయితే సంగీత చేసినవి ఆరోపణలు మాత్రమే అని నమ్మిన కొంతమంది అభిమానులకు కూడా నిన్న దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పని చేశాడు విజయ్. నిన్న చెన్నై లో విజయ్, హీరోయిన్ త్రిష(Trisha Krishnan) కలిసి జంటగా ఒక ప్రముఖ స్టార్ నిర్మాత పెళ్ళికి హాజరు అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది కావాలనే విజయ్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికే చేసినట్టుగా తెలుస్తోంది. తాను ప్రస్తుతం త్రిష తో రిలేషన్ షిప్ లో ఉన్నానని, త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ చెప్పకనే చెప్పేసాడు విజయ్. ఇది చూసిన తర్వాత విజయ్ అభిమానులే గుండెలు ముక్కలు అయ్యాయి. తాము ఇంతకాలం అభిమానించింది ఇలాంటి వాడినా ?, పాపం సంగీత గారు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్యారెక్టర్ లేని వాడికి మేము సపోర్టు చేయము అంటూ తేల్చి చెప్పేస్తున్నారు.

తన భార్య తో విబేధాలు ఏర్పడి , విడిపోయి , ఆ తర్వాత త్రిష తో సంబంధం పెట్టుకుంటే అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ తన భార్య కలిసి ఉంటూ, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యి కూడా , ఇలా వివాహేతర సంబంధం త్రిష తో పెట్టుకోవడమే విజయ్ చేసిన అతి పెద్ద తప్పు. నిన్న రాత్రి ఆ వీడియో తోనే విజయ్ రాజకీయ జీవితం సమాధి అయిపోయిందని అంతా అంటున్నారు. ఇలా ఆయన పబ్లిక్ లో త్రిష తో కలిసి స్వేచ్ఛ గా తిరగడానికి కారణం, అతని భార్య సంగీత తో ఒక సెటిల్మెంట్ కి వచ్చినట్టు తెలుస్తోంది. సుమారుగా 250 కోట్ల రూపాయిల భరణం ఇచ్చి, ఆమె తో వైవాహిక బంధం పూర్తిగా తెంచుకున్నాడట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular